తెలంగాణ

కేంద్ర బడ్జెట్ సెస్ ప్రభావంతో ఆర్టీసీపై రూ. 67 కోట్ల భారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 6: కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్‌లో సూచించిన సెస్ విధానం తెలంగాణ ఆర్టీసీపై తీవ్ర ప్రభావం చూపనుంది. కేంద్రం పెంచిన సెస్ విధానంతో ఏడాదికి రూ. 67 కోట్ల రూపాయలు అదనంగా భారం పడుతుందని ఆర్టీసీ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. దీంతో ఇక ఆర్టీసీ నడపడం కష్టసాధ్యంగా మారుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. రానున్న నష్టాలను అధిగమించడానికి ప్రభుత్వం ఎలాంటి మార్గదర్శకాలను సూచిస్తుందో వేచిచూడాల్సిందేనని ఆయన అన్నారు. ఇప్పటికే ఆర్టీసీకి దాదాపురూ. 650 కోట్లు అప్పులు ఉన్నాయన్నారు. కేంద్రం బడ్జెట్‌లో పెట్రో, డీజల్‌పై లీటర్‌కు రూపాయి సెస్‌ను అమలు చేస్తామని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం రాష్ట్రంలో ఆర్టీసీ బస్సులకు రోజూ 7 లక్షల లీటర్ల డీజల్‌ను వినియోగిస్తున్నారు. రాష్ట్రంలో రోజూ 35 లక్షల కిలోమీటర్ల దూరాన్ని బస్సులు ప్రయాణం చేస్తున్నాయి. కేంద్రం కేవలం రూపాయి సెస్‌ను పెంచుతున్నామని ప్రకటించగా వాటి ప్రభావం తెలంగాణలో ప్రతి డీజిల్ లీటర్‌పై రూ.2.65 పైసలు అదనంగా భారం పడుతోంది. పెరిగిన డీజల్ ధరలతో ఆర్టీసీకి రోజూ రూ.18 లక్షలకు పైగా భారం పడుతుంది. నెలకు సరాసరి రూ.5,67 కోట్లు భారం పడనుంది. సంవత్సరానికి రూ.67 కోట్ల రూపాయలు అదనపు భారం పడుతుందని ఆర్టీసీ సీనియర్ అధికారి తెలిపారు. కాగా, డీజల్ ధరలను కేంద్రం పెంచడాన్ని ఆర్టీసీ యూనియన్లు కనె్నర్ర చేశాయి. పెరిగిన డీజల్ ధరలతో నిత్యావసర సరుకుల ధరలు అమాంతంగా పెరగడంతో సామాన్యులపై భారం పడుతుందని యూనియన్లు ధ్వజమెత్తాయి. ఆర్టీసీ సిబ్బందిపై పెరిగిన భారం చూపుతుందని జాతీయ మజ్దూర్ యూనియన్ నేత హనుమంత్ ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్టీసీని కాపడడానికి ప్రభుత్వం ముందుకు రావాలని ఎంప్లారుూస్ యూనియన్ నేత రాజిరెడ్డి సూచించారు. ఆర్టీసీ మనుగడ సాధించడానికికి ప్రభుత్వంలో విలీనం చేయడం తప్ప మరొక గత్యంతరం లేదన్నారు. ఆర్టీసీ నష్టాలకు కార్మికులు కాదని, యాజమాన్యం చేస్తున్న దుబారా ఖర్చులని రాజిరెడ్డి ఆరోపించారు. ఈనెలలో ఆర్టీసీ గుర్తింపు యూనియన్ ఎన్నికల నిర్వహిస్తున్నందున ఎన్నికల రంగంలోకి యూనియన్లు దిగుతున్నాయని చెప్పారు. యూనియన్ ఎన్నికల మేనిఫెస్టోలో ఆర్టీసీ గుర్తింపు ఎన్నికల్లో ప్రధాన అంశంగా ప్రచారం చేస్తామని ఆయన చెప్పారు. జాతీయ మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో ఈ నెల 7వతేదీ నుంచి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్‌తో అన్ని జిల్లాల బస్ డిపోల్లో నిరసనలు, ధర్నాలు చేస్తామని యూనియన్ ప్రధాన కార్యదర్శి హనుమంత్ తెలిపారు.