తెలంగాణ

రైతు బీమా కింద రూ. 641 కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 6: రాష్ట్రంలో ‘రైతుబీమా’ పథకం కింద ఇప్పటి వరకు 12,820 మంది రైతుకుటుంబాలకు 641 కోట్ల రూపాయలు చెల్లించామని వ్యవసాయ శాఖ ముఖ్యకార్యదర్శి సి. పార్థసారథి తెలిపారు. సచివాలయంలోని ‘సీ’ బ్లాకు నుండి జిల్లాల్లోని వ్యవసాయ, ఉద్యాన శాఖ సిబ్బందితో శనివారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు పనిచేస్తున్న సిబ్బంది, అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్థసారథి మాట్లాడుతూ, రైతుబీమా పథకం కిదం 30,65,000 మంది రైతులు తమ పేర్లను రిజిస్టర్ చేసుకున్నారని తెలిపారు. వీరిలో 12,820 మంది రైతులు మరణించడంతో వారి కుటుంబాలకు ఒక్కొక్క కుటుంబానికి 5 లక్షల రూపాయల చొప్పున చెల్లించామన్నారు.
నైరుతీ రుతుపవనాలు రావడంలో జాప్యం జరిగిందని, దాంతో రైతులు విత్తనాలు వేయడంలో కొంత ఆలస్యం జరిగిందని పార్థసారథి తెలిపారు. రైతులు విత్తనాలు వేయడం మొదలు కావడంతో గ్రామస్థాయిలోని వ్యవసాయ విస్తరణాధికారులు, మండలాల్లోని వ్యవసాయ అధికారులు ఎల్లవేళలా రైతులకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. పంటల వివరాలను ఎప్పటికప్పుడు సేకరించి జిల్లాస్థాయి అధికారులకు, రాష్టస్థ్రాయి అధికారులకు పంపించాలని సూచించారు. పంటల్లో పత్తి విస్తీర్ణం అధికంగా ఉండటం వల్ల ఈ పంటవేసే రైతులు పంటలబీమాలో తమ పేర్లను నమోదు చేయించుకునేందుకు క్షేత్రస్థాయి సిబ్బంది సహకరించాలని కోరారు. పత్తిపంటకు బీమా చేయించుకునే గడువు ఈ నెల 15 తో ముగుస్తుందని, దాంతో ఈలోగా పత్తిపంట వేసే రైతులంతా పంటల బీమా చేయించుకునేలా చూడాలన్నారు. మిగతా పంటలకు బీమా జూలై 31 వరకు గడువు ఉందని గుర్తు చేశారు. రైతుబంధు పథకం కింద ఇప్పటి వరకు 60 శాతం మంది రైతులకు వారి బ్యాంక్ అకౌంట్లలో డబ్బులు జమ చేశామన్నారు. మిగతా రైతులకు త్వరలోనే వారి ఖాతాలకు డబ్బు జమ చేస్తామన్నారు. రైతులు ఎవరైనా వారి బ్యాంకు ఖాతాలను ప్రభుత్వ పోర్టల్‌లో నమోదు చేయించుకోలేదో వారు వెంటనే తమ పేర్లను నమోదు చేయించుకోవాలని విజ్ఞప్తి చేశారు. రైతుల పేర్లను గ్రామ పంచాయతీల నోటీసుబోర్డులపై వేయాలని ఆదేశించారు. ‘గివ్ ఇట్ అప్’ పథకం గురించి కూడా విస్తృతంగా ప్రచారం చేపట్టాలన్నారు. పీఎం కిసాన్ పథకం కింద సంవత్సరానికి 6,000 రూపాయలు రైతుఖాతాల్లో జమ చేస్తామని, మొదటి విడత ఈ నెలలోనే జమ అవుతుందన్నారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభం కావడంతో విత్తనాలు, ఎరువుల సరఫరాపై నిరంతరం పర్యవేక్షణ ఉండాలన్నారు. ఈ సమావేశంలో వ్యవసాయ కమిషనర్ రాహుల్ బొజ్జా, ఉద్యాన కమిషనర్ వెంకట్రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.