తెలంగాణ

వచ్చే ఎన్నికల్లో మాదే గెలుపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 6: టీఆర్‌ఎస్ పార్టీ తాటాకు చప్పుళ్లకు భయపడే ప్రసక్తిలేదని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గోల్కొండ కోట మీద పార్టీ జెండాను ఎగరువేస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ అన్నారు. శనివారం ఇక్కడ శంషాబాద్‌లో జరిగిన పార్టీ సభ్యత్వ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ టీఆర్‌ఎస్ పాలనపై తీవ్రమైన విమర్శలు గుప్పించారు. సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా ప్రారంభించారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ, రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబ పాలన అవినీతిమయమైందన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో ప్రజలు కేసీఆర్ కుమార్తె కవితను, కరీంనగర్ స్థానంలో వినోద్‌ను ఓడించారన్నారు. రాజకీయ యుద్ధానికి బీజేపీ సమాయత్తమైందన్నారు. ప్రతి బూత్ నుంచి సుశిక్షితులైన కార్యకర్తలను తయారు చేస్తామన్నారు. రాష్ట్రంలో టీడీపీ కనుమరుగైందన్నారు. కాంగ్రెస్ చతికిలపడిందని, కుప్పకూలిందన్నారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ యుద్ధం చేయలేక అస్తస్రన్యాసం చేశారన్నారు.
టీఆర్‌ఎస్ క్రమేపీ ప్రజాదరణ కోల్పోయిందని, నీటి బుడగ లాగా ఏ క్షణమైనా పగిలిపోవచ్చన్నారు. ఆ పార్టీ నేతల్లో అంతర్మథనం జరుగుతోందని ఆయన చెప్పారు. బీజేపీ నాలుగు లోక్‌సభ సీట్లను గెలుచుకుందని, 20 శాతం ఓట్లు వచ్చాయని ఆయన చెప్పారు. బీజేపీ విస్తరణను అడ్డుకునేందుకు టీఆర్‌ఎస్ చేస్తున్న ప్రయత్నాలను తిప్పిగొడతామని ఆయన అన్నారు. తమ పార్టీ కార్యకర్తలపై దాడులు చేస్తే ఊరుకునే ప్రసక్తిలేదన్నారు. ఎంఐఎంతో అంటకాగుతూ రాష్ట్రంలో టీఆర్‌ఎస్ అరాచకాలకు పాల్పడుతోందన్నారు.
బీజేపీలో చేరిన కార్యకర్త ఉన్నత స్థానానికి ఎదగవచ్చన్నారు. పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా గుజరాత్‌లో ఒక పోలింగ్ బూత్ మేనేజర్‌గా పనిచేసిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.
మిగతా పార్టీల్లో కుటుంబ సభ్యుల పెత్తనం సాగుతోందన్నారు. గాంధీ, నెహ్రూ కుటుంబాల మాదిరిగా ఒంటెత్తుపోకడలు ఉండవన్నారు. రాష్ట్రంలో 20 లక్షల సభ్యత్వం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ప్రతి బూత్‌లో 50 మంది కార్యకర్తలు ఉంటారని, వారికి శిక్షణ తరగతులు నిర్వహిస్తామన్నారు.

చిత్రం...అమిత్‌షా కు స్వాగతం చెబుతున్న లక్ష్మణ్