తెలంగాణ

కన్న కొడుకును రైల్వేస్టేషన్‌లో వదిలిన తండ్రి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కామారెడ్డి, జూలై 7: తన కొడుకే తనకు భారమని భావించాడో ఏమో ఒక తండ్రి కన్నకొడుకును రైల్వేస్టేషన్‌లో వదిలిపెట్టి వెళ్లిపోయాడు. ఈ సంఘటన జగిత్యాల మండలంలోని లింగంపేట్ రైల్వేస్టేషన్‌లో జరిగగా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. కామారెడ్డి జిల్లాకు చెందిన రాజు అనే వ్యక్తి తన భార్య చనిపోవడంతో ఉన్న ఒక్క కొడుకు అయిన వినయ్ (12)ను భారంగా భావించాడో ఏమోగాని ఆ బాలుడిని నేరుగా జగిత్యాల జిల్లాలోని లింగంపేట్ రైల్వేస్టేషన్‌లో ఆదివారం ఉదయం వదిలి వెళ్లిపోయాడు. పిల్లవాడు లింగంపేట్ రైల్వేస్టేషన్‌లో ఏడుస్తుంటే, చుట్టుపక్కల వారు చూసి పోలీసులకు సమాచారం అందించడంతో జగిత్యాల పోలీసులు పిల్లవాడిని దగ్గరకు తీసుకుని విచారించారు. తన తండ్రి కామారెడ్డిలో ఉంటాడని, తనను స్టేషన్‌లో వదిలి వెళ్లిపోయాడంటూ వినయ్ పోలీసులకు వివరించాడు. ప్రస్తుతం కామారెడ్డి జిల్లాకు చెందిన రాజు ఎక్కడ ఉన్నాడన్న విషయం గురించి విచారణ చేస్తున్నట్లు సమాచారం. పిల్లవాడు అందించిన సమాచారం ప్రకారం అతని తండ్రిని తీసుకుని వచ్చి పిల్లవాన్ని అతనికి అప్పగించడమో లేదా చైల్డ్ హోమ్స్‌లో చేర్పించడం చేసే ఆలోచనలో పోలీసులు ఉన్నట్టు తెల్సింది. పోలీసులు ఆ బాలుడిని విచారిస్తున్న ఫొటోలు మాత్రం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.
చిత్రం...జగిత్యాల మండలం లింగంపేట్ పోలీసుస్టేషన్‌లో కన్నతండ్రి వదిలిపెట్టిన చిన్నారిని ప్రశ్నిస్తున్న పోలీసులు