తెలంగాణ

డ్రిప్ ఇరిగేషన్‌లో సబ్సిడీ ఎత్తివేసేందుకు ప్రభుత్వం కుట్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 7: రాష్ట్రప్రభుత్వం డ్రిప్ ఇరిగేషన్ యూనిట్ల కోసం అమలు చేయనున్న నేరుగా నగదు బదలాయింపు పథకం వల్ల రైతులకు ఎలాంటి ప్రయోజనం ఉండదని తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎస్ ఆనే్వష్ రెడ్డి అన్నారు. ఆదివారం ఇక్కడ ఆయన మాట్లాడుతూ చిన్న, సన్నకారు రైతులు చాలా నష్టపోతున్నారని, ప్రభుత్వం తీరు చూస్తే రాబోయే రోజుల్లో బిందు సేద్యం మీద పూర్తిగా సబ్సిడీ ఎత్తివేసే విధంగా కనపడుతోందన్నారు. నీటి తీవ్రత వల్ల చాలీచాలని సాగునీళ్లు ఉండడం వల్ల సాగు చేయాలని, బిందు తుంపర సేద్యం ద్వారా పంటలు సాగు చేస్తున్నారన్నారు. దీని కోసం ప్రభుత్వం సబ్సిడీ ద్వారా రైతులకు డ్రిప్ పరికరాలు ఇచ్చేదన్నరు. గడచిన ఐదేళ్లలో రాష్ట్రప్రభుత్వం నాబార్డ్ ద్వారా అప్పు చేసుకుని రైతులకు డ్రిప్ యూనిట్లు ఇచ్చామన్నారు. ప్రభుత్వం అప్పు తీసకుని దానికి డబ్బులు చెల్లిస్తున్నారన్నారు. ఒక యూనిట్‌కు పసుపు పంటకు రైతుపై రూ.20వేలు కలిపి మొత్తం ఒకేసారి కట్టాలన్నారు. ఈ విధానం ద్వారా రైతులకు డ్రిప్ అందడం కష్టమన్నారు. ప్రభుత్వం తన కొత్త ఆలోచనా విధానాన్ని విరమించుకోవాలన్నారు. పాత విధానం ద్వారా అప్లికేషన్‌ను పెట్టుకున్న ప్రతి రైతుకు డ్రిప్ అందివ్వాలని కోరారు.