తెలంగాణ

తెలంగాణ అంటే ఎందుకు ఇంత వివక్ష?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 7: తెలంగాణ పట్ల కేంద్రం వివక్ష చూపిస్తోందని కాంగ్రెస్ సీనియర్ నేత మహ్మద్ అలీ షబ్బీర్ ధ్వజమెత్తారు. ఆదివారం ఇక్కడ ఆయన విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ బడ్జెట్‌లో నిధుల కేటాయింపు చూస్తుంటే దారుణంగా ఉందన్నారు. రాష్ట్రప్రభుత్వం అమలు చేస్తున్న ఏ ప్రాజెక్టుకు కూడా నిధులు కేటాయించలేదన్నారు. 2019-20లో రూ.19179 కోట్లు కేటాయించారన్నారు. ఇవి ఏ మాత్రం చాలుతాయన్నారు. గత ఏడాది రూ. 18561 కోట్లు ఇచ్చారన్నారు. ఈ నిధులు ఏ మూలకు వస్తాయన్నారు. కేవలం రూ.1150 కోట్లను అదనంగా ఇచ్చారన్నారు. కేంద్రానికి టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై కక్షనా, లేక టీఆర్‌ఎస్ ప్రభుత్వంపైనా అని ఆయన నిలదీశారు. బీజేపీ, టీఆర్‌ఎస్ రెండు పార్టీలు ఎన్నికలు లక్ష్యంగా పనిచేస్తున్న పార్టీలని ఆయన అన్నారు. అభివృద్ధి అంటే కేసీఆర్‌కు పట్టదన్నారు. విపక్షాలపై విమర్శలు చేయడం తప్ప కేంద్రం నుంచి నిధులు ఎలా తీసుకురావాలో తెలియదన్నారు. 2014 నుంచి బీజేపీ తెలంగాణను నిర్లక్ష్యం చేస్తోందన్నారు. ఢిల్లీకి వెళ్లి నిధులు ఇతోధికంగా ఇవ్వాలిన మోదీ ప్రభుత్వాన్ని కోరే తీరిక కూడా కేసీఆర్‌కు లేదన్నారు. కేంద్రం మంజూరు చేసిన నిధులపై శే్వతపత్రం ప్రకటిటంచాలన్నారు. మైనారిటీలకు కేంద్రం రూ.4700 కోట్ల నిధులను కేటాయించిందన్నరు. అన్ని వర్గాల పట్ల సమానంగా ఉంటామని చెబుతున్న కేంద్రం మైనారిటీల పట్ల పక్షపాత వైఖరితో ఉందన్నారు. కేంద్ర ఆర్థిక విధానాల్లో లోపాలను సరిదిద్దుకోవాలని ఆయన సూచించారు.