తెలంగాణ

నల్లమలలోకి పర్యాటకుల ప్రవేశంపై నిషేధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అచ్చంపేట, జూలై 8: ఈనెల నుండి మూడు నెలల పాటు అమ్రాబాద్ టైగర్ రిజర్వు ఫారెస్టు అయిన నల్లమల అటవీ ప్రాంతంలో పర్యాటకులకు ప్రవేశం నిషేధించామని, పర్యాటకులు దీనికి సహకరించాలని జిల్లా అటవీ అధికారి ఎం.జోజి తెలిపారు. పులులతో పాటు మరికొన్ని జంతువులు సంతోనోత్పత్తికి ఈ మూడు నెలల కాలం అనువైనదని పర్యాటకులు అడవి మార్గంలో సంచరిస్తే పులులకు, ఇతర జంతువుల కలయికకు ఆటంకం కలిగే అవకాశం ఉన్నందున్న అవి దాడి చేయవచ్చనే ముందు జాగ్రత్త చర్యగా ప్రతి ఏడాది ఈ మూడు నెలలు పర్యాటకుల అనుమతులన్నింటినీ రద్దు చేస్తామని అన్నారు. జాతీయ పెద్ద పులుల సంరక్షణ కేంద్రం న్యూఢిల్లీ వారిఆదేశాల మేరకు నల్లమలతో పాటు మిగతా అభయారణ్యాల అందాలను తిలకించేందుకు నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలని ఆదేశాలున్నాయని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో 23 శాతమే అడవులు ఉన్న నేపథ్యంలో తెలంగాణకు హారితహారం కార్యక్రమాన్ని పెద్దఎత్తున చేపట్టి ప్రతిగ్రామానికి ప్రత్యేకంగా నర్సరీని ఏర్పాటు చేసి విరివిగా మొక్కలను పెంచుతున్నామన్నారు. నైరుతి వర్షాలు ఆరంభం కావడంతో జిల్లాల్లో విస్తరించి ఉన్న 2535 చదరపు కిలో మీటర్ల అడవీ ప్రాంతం పచ్చటి ఆకులతో కమ్ముకుపోతుందన్నారు. ఈ తరుణంలోనే నల్లమలల్లో ఉన్న 17 పెద్ద పులులతో పాటు ఎలుగుబంట్ల సంతానోత్పత్తికి మూడు నెలలు ఎంతగానే దోహదపడుతుందని, అందువల్ల వాటికి ఎలాంటి అసౌకర్యం కలిగించకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. వ్యూ పాయింట్‌తో సహా అన్ని పర్యాటక కేంద్రాలను మూసి వేస్తున్నట్టు ఆయన చెప్పారు. తిరిగి అక్టోబర్ మొదటి వారంలో పర్యాటకులకు అనుమతులు ఇచ్చి వ్యూ పాయింట్ వరకు వాహన రాకపోకలను అనుమతిస్తామన్నారు. తమ అధికారులు, సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ కనబరిచి అడవిలో మనుషుల కదలికలు లేకుండా చర్యలు తీసుకుంటారని అడవికి దగ్గరలో ఉన్న చెంచు గూడాలు, పెంటలలో అవగాహన కలిగిస్తున్నామన్నారు. మగ, ఆడ పులులు వారం పాటు సంభోగం జరుపుకొని ఒకదానికొకటి కలిసే ఉంటాయని తరువాత విడిపోతాయని ఆడపులి గర్భం దాల్చిన 94 రోజుల నుంచి 115 రోజుల వరకు పులి పిల్లలకు జన్మనిస్తుందని పేర్కొన్నారు. అడవి జంతువుల జీవన విధానానికి భంగం కలిగించకుండా ఈప్రాంతంలో నివసిస్తున్న వారు కూడా నిబంధనలు పాటిస్తూ సెప్టెంబర్ 30 వరకు అడవిలోకి ఎవరూ వెళ్ళరాదని శ్రీశైలం వెళ్ళే భక్తులు, యాత్రికులు, నల్లమల అడవి మార్గంలో ప్రయాణించేటప్పుడు దాడి పొడవునా ఎక్కడా కూడా తమ వాహనాలను నిలుపరాదని అలా చేసినట్టయితే వన్యమృగాలు వారిపై దాడి చేసే అవకాశాలున్నాయని జిల్లా అటవీ అధికారి జోజి హెచ్చరించారు.

చిత్రం...అమ్రాబాద్ టైగర్ రిజర్వు ఫారెస్టులోని నల్లమల అడవి
*(ఇన్‌సెట్‌లో ) జిల్లా అటవీ అధికారి జోజి