తెలంగాణ

తప్పులు చేస్తే ఉపేక్షించం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాసర, జూలై 8: యూనివర్సిటీలో తప్పులు చేసేవారు ఎంతటిస్థాయిలో ఉన్నా వదిలే ప్రసక్తే లేదని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. సోమవారం బాసర ఆర్జీయూకేటీ యూనివర్సిటీని మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, జిల్లా ఎస్పీ శశిధర్‌రాజు, భైంసా ఆర్డీవో రాజు, ముధోల్ సీఐ శ్రీనివాస్ కలిసి సందర్శించారు. ప్రధాన ద్వారం వద్ద సెక్యూరిటీ గార్డ్స్‌తో మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి మాట్లాడారు. విద్యార్థులకు ఔట్ పాసులు ఇచ్చే క్రమంలో యూనివర్సిటీ అధ్యాపకులు సూచించే విద్యార్థినులను పంపకూడదని సూచించారు. నిబంధనల మేరకు నడుచుకోవాలని సెక్యూరిటీ సిబ్బందికి మంత్రి సూచించారు. అనంతరం ఆర్జీయూకేటీ యూనివర్సిటీకి చేరుకున్న మంత్రికి యూనివర్సిటీ పరిపాలన అధికారి శ్రీహరి, డిప్యూటీ రిజిస్టర్ మూర్తి స్వాగతం పలికారు. ఆర్జీయూకేటీ పరిపాలన భవనంలో వైస్ ఛాన్స్‌లర్ సమావేశ మందిరంలో మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, జిల్లా ఎస్పీ శశిధర్‌రాజు, భైంసా ఆర్డీవో రాజు, యూనివర్సిటీ పరిపాలన అధికారి శ్రీహరి, యూనివర్సిటీ డిప్యూటీ రిజిస్ట్రార్ మూర్తి చీఫ్, వార్డెన్‌లతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం గంటకుపైగా సాగింది. యూనివర్సిటీలో విద్యార్థినుల భద్రత, వారి సంక్షేమానికి తీసుకోవాల్సిన చర్యలు తదితర వాటిపై గంటకుపైగా సమావేశం నిర్వహించారు. సంఘటనకు సంబంధించి మంత్రి అధికారులతో పూర్తి వివరాలను అడిగి తెలుసుకున్నారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా గట్టి చర్యలు చేపట్టాలని యూనివర్సిటీ అధికారులకు సూచించారు. ఏడు వేల మంది విద్యార్థులు ఉన్న యూనివర్సిటీలో విద్యార్థినులు తమ సమస్యలు చెప్పుకునేందుకు ఓ ప్రత్యేక సెల్ ఏర్పాటుచేయాలని సూచించారు.
షీ టీమ్ సదస్సును ప్రారంభించిన మంత్రి
ఆర్జీయూకేటీ యూనివర్సిటీలో సోమవారం భైంసా డివిజన్ పోలీసుల ఆధ్వర్యంలో షీ టీమ్ సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, కళాశాల పరిపాలన అధికారి శ్రీహరి, ఇతర అధికారులు జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శశిధర్‌రాజు మాట్లాడుతూ యూనివర్సిటీలోని విద్యార్థులకు షీటీమ్ ఎల్లవేళలా అందుబాటులో ఉంటుందని అన్నారు. ఏమైనా సమస్యలు ఉంటే నేరుగా తమను సంప్రదించాలని అన్నారు. ఇప్పటి నుండి కళాశాలలోని మెస్‌లో, వసతి భవనం, తరగతి గది వద్ద ప్రత్యేక ఫిర్యాదుల బాక్స్‌ను ఏర్పాటు చేస్తామని చెప్పారు. మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని ఏకైక ఆర్జీయూకేటీ యూనివర్సిటీ బాసరలో ఉందన్నారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఇంజనీరింగ్ విద్యను అందించాలనే ఉద్దేశంతో యూనివర్సిటీలో 1000 సీట్లను 1500కు పెంచినట్టు తెలిపారు. విద్యార్థినులకు ఏమైనా సమస్యలు ఉంటే కళాశాల చీఫ్ వార్డెన్లకు, ఉన్నత అధికారులకు సమాచారం ఇవ్వాలని అన్నారు. షీ టీమ్ సభ్యులు విద్యార్థుల హక్కులు, ఈవ్‌టీజింగ్, తదితర వాటిపై అవగాహన కల్పిస్తారని అన్నారు.
తరగతి గదిలో మెస్‌లో, వసతి గదుల వద్ద ప్రత్యేక ఫిర్యాదుల బాక్సులను ఏర్పాటు చేస్తామని, విద్యార్థులు తమ సమస్యలను ఒక చీటీలో రాసి ఉంచితే పోలీసులు పరిష్కరిస్తారని అన్నారు.

చిత్రం... బాసర యూనివర్శిటీ అధికారులతో చర్చలు జరుపుతున్న మంత్రి