తెలంగాణ

పోలీసులే లక్ష్యంగా మావోల మందుపాతరలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబాబాద్, జూలై 8: పోలీసులు లక్ష్యంగా మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం మొట్లతిమ్మాపురం, రామచంద్రాపురం మధ్య ఉన్న ఉడుముల ఒర్రె బ్రిడ్జి కింద అమర్చిన ఆరు మందుపాతర్లను మహబూబాబాద్ జిల్లా పోలీసులు సోమవారం స్వాధీనం చేసుకొన్నారు. మావోయిస్టు ఎన్‌టిఎస్‌జెడ్‌సి కార్యదర్శి హరిభూషణ్ అలియాస్ యాప నారాయణకు చెందిన ఇద్దరు కొరియర్లను అరెస్ట్ చేశారు. మహబూబాబాద్ జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఎస్పీ కోటిరెడ్డి ఈ కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. బయ్యారం మండలం మొట్లతిమ్మాపురం, గూడూరు మండలం తిమ్మాపురం, గంగారం మండలం మడగూడెం ఈ మూడు గ్రామాల మధ్యలో ఉన్న నీలమయ గుట్టలను హరిభూషణ్ తనకు అనువైన షెల్టర్‌గా చాలాకాలంగా ఉపయోగిస్తున్నారనే సమాచారంతో రెండు రోజుల క్రితం నీలమయ గుట్టల్లో కూంబింగ్ నిర్వహించడానికి పోలీస్ పార్టీని పంపారు. గాలింపు అనంతరం పోలీస్‌పార్టీ మొట్లతిమ్మాపురం గ్రామం బయ్యారం రోడ్డు మార్గాన వస్తుండగా హరిభూషణ్ కొరియర్లు భూమయ్య, ధనసరి శ్రీనివాస్ తారసపడగా వారిని అదుపులోకి తీసుకొని విచారించడంతో అనేక సంచలన అంశాలు బయటపడ్డాయి. ధనసరి శ్రీను దాదాపు 10 సంవత్సరాల నుండి మావోయిస్టు పార్టీ హరిభూషణ్ కొరియర్‌గా పనిచేస్తున్నాడని హరిభూషణ్‌తో పాటు ఎవరు నీలమయ గుట్ట ప్రాంతానికి వచ్చినా వారికి కావాల్సిన ఆహార సామాగ్రి, బట్టలు అందజేయడంతో పాటు ఆరోగ్యపరమైన సేవలు కూడా అందించేవాడన్నారు. దాదాపు సంవత్సరం క్రితం మావోయిస్టు దళ నాయకుడు హరిభూషన్, భద్రు, మాధవి, ఉమ నీలమయ గుట్టకు వచ్చినప్పుడు వారు ఆశ్రయం పొందే గుట్టకు గల దారికి ఉన్న ఉడుముల ఒర్రె బ్రిడ్జి కింద ఆరు మందుపాతర్లు అమర్చారు. వాటిని పోలీసులు వచ్చినప్పుడు పేల్చమని ధనసరి శ్రీనుకు బాధ్యతలు అప్పగించినట్టు ఎస్పీ కోటిరెడ్డి తెలిపారు. ఆరు మందుపాతర్లు, డైరెక్టనైల్ మైన్స్ అని అత్యంత శక్తివంతమైనవని అన్నారు. వీటిలో పేలుడు పదార్ధంతో పాటు ఇనుపచువ్వలు, నట్టు బోల్టులు, ఇనుప పైపులు పెట్టి తయారు చేశారన్నారు. ఇవి పేలితే దాదాపు 500 గజాల దూరం వరకు తీవ్ర విధ్వంసం జరుగుతుందని వీటితో పోలీసులను హతమార్చాలనే లక్ష్యంతో మావోయిస్టులు పాతిపెట్టారని కోటిరెడ్డి చెప్పారు. రెండవ కొరియర్ యాప భూమయ్య స్వయాన హరిభూషణ్‌కు పెదనాన్న. ఇతనిపై ఇప్పటికే వివిధ పిఎస్‌లలో తొమ్మిది క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఇతను దాదాపు 15 సంవత్సరాల నుండి మావోయిస్టు పార్టీ మిలిటెంట్‌గా, కొరియర్‌గా పనిచేస్తున్నాడని ఎస్పీ కోటిరెడ్డి తెలిపారు. భూమయ్య నీలమయ గుట్టలకు హరిభూషణ్ వచ్చిన ప్రతిసారి అతని వద్దకు వచ్చి పార్టీకి కావాల్సిన వస్తువులు, ఆహార పదార్ధాలు అందిస్తాడన్నారు. వీరిద్దరినీ అదుపులోకి తీసుకొని విచారించడంతో మందుపాతర్ల విషయం బయట పడిందని, ఉడుముల ఒర్రె బ్రిడ్జి కింద అమర్చిన మందుపాతర్లను బాంబు తనిఖీ నిపుణుల సహాయంతో బయటకు తీసి స్వాధీన పర్చుకున్నామని ఎస్పీ కోటిరెడ్డి తెలిపారు. జిల్లా అడిషనల్ ఎస్పీ రావుల గిరిధర్, మహబూబాబాద్ డీఎస్పీ నరేష్‌కుమార్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
చిత్రం... పట్టుబడిన మందుపాతర్లను మీడియాకు చూపిస్తున్న ఎస్పీ కోటిరెడ్డి