తెలంగాణ

మున్సిపల్ ఎన్నికలపై దృష్టి పెట్టండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 8: త్వరలో జరుగనున్న మున్సిపల్ ఎన్నికలపై దృష్టి సారించాలని పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులను టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు ఆదేశించారు. పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం రాష్టవ్య్రాప్తంగా పండుగ వాతావరణంలో జరుగుతోందని కేటీఆర్ అన్నారు. పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇంచార్జీలతో సోమవారం కేటీఆర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. పట్టణ ప్రాంతాలలో విద్యావంతులు, వృత్తి నిపుణులు, కాలనీ సంఘాల ప్రతినిధులను కలిసి వారిని పార్టీ సభ్యత్వం స్వీకరించే విధంగా చూడాలని సూచించారు. యువకులు, విద్యావంతులు పార్టీలో చేరేందుకు ఉత్సాహం చూపుతున్నారన్నారు. ఆన్‌లైన్ ద్వారా కూడా సభ్యత్వం పొందవచ్చని వారికి సూచించాలన్నారు. అలాగే వీరి కోసం ప్రత్యేక కౌంటర్లు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. సభ్యత్వ నమోదుపై స్థానిక టీవీ చానల్స్, వాట్సాప్, ఇతర సామాజిక మాధ్యమాలను విస్తృతంగా ఉపయోగించుకోవాలని సూచించారు. ఇంటింటికీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని తీసుకుపోవాలన్నారు. గ్రామాలలో వ్యవసాయ పనులు ప్రారంభం కావడంతో ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రత్యేక శిబిరాలను వారి కోసం ఏర్పాటు చేయాలని ఆదేశించారు. బీడీ కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు, ఆటో డ్రైవర్లు తదితర కార్మిక వర్గాలను నేరుగా కలిసి సభ్యత్వం తీసుకోవాల్సిందిగా కోరాలన్నారు.
ఇప్పటి వరకు జరిగిన సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని డిజిటలీకరణ చేయాలన్నారు. ప్రతి నియోజకవర్గం నుంచి కనీసం 50 వేల నుంచి 60 వేల సభ్యత్వాలు జరగాలన్నారు.