తెలంగాణ

గడువులోగా అక్రిడిటేషన్ పొందాల్సిందే.

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 8: గడువులోగా రాష్ట్రంలోని ఉన్నత విద్యాసంస్థలు అన్నీ జాతీయ స్థాయి ప్రమాణాలకు అనుగుణంగా అక్రిడిటేషన్ పొందాల్సిందేనని లేకుంటే ప్రభుత్వ నిధులు నిలిచిపోతాయని, అనుబంధ గుర్తింపు రద్దవుతుందని ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ టీ పాపిరెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ ఉన్నత విద్యామండలి, కాలేజీయేట్ ఎడ్యుకేషన్ కమిషనరేట్ , రాష్ట్రీయ ఉచ్ఛతర్ శిక్షా అభియాన్ సంయుక్త ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు నిర్వహించే అక్రిడిటేషన్ జాతీయ సదస్సులో ఆయన మాట్లాడారు. విద్యాశాఖ కార్యదర్శి డాక్టర్ బి జనార్థన్‌రెడ్డి, కమిషనర్ నవీన్ మిట్టల్, మండలి ఉపాధ్యక్షులు ప్రొఫెసర్ వీ వెంకటరమణ, ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి, కార్యదర్శి డాక్టర్ శ్రీనివాసరావులు మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలోని ఉన్నత విద్యారంగంలో నాణ్యతను మెరుగుపరచడంపై భవిష్యత్ విధానాలు, వ్యూహాలపై ఆలోచనలు విద్యాసంస్థల గుర్తింపుపై విధాన కర్తలు, విద్యా నిర్వాహకులు, జాతీయ నియంత్రణ మండళ్ల ప్రతినిధులు ఈ వర్కుషాప్‌లో ఒకే వేదికపైకి రానున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యాలకు అనుగుణంగా తెలంగాణలో ఉన్నత విద్యను దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో నిలిపేందుకు ప్రమాణాలను పెంచాల్సి ఉందని పేర్కొన్నారు. ఇప్పటికే పలు యూనివర్శిటీలు, ఇంజనీరింగ్, వృత్తి సాంకేతిక విద్యాసంస్థలూ డిగ్రీ, పీజీ కాలేజీలు, నేక్ గుర్తింపు పొందాయని, మిగిలిన విద్యాసంస్థలు కూడా నేక్ గుర్తింపు పొందాల్సిందేనని చెప్పారు. అక్రిడిటేషన్, క్వాలిటీ పెంపు, ర్యాంకింగ్ ఈ మూడు అంశాలపై నిర్వహిస్తున్న సదస్సులో ముఖ్య వక్తగా నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వీ కే సారస్వత్ హాజరయ్యారు. కేరళ విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి డాక్టర్ ఉషా టైటస్, తమిళనాడు టీఎస్‌సీహెచ్‌ఈ ఉపాధ్యక్షుడు మంగత్ రామ్ శర్మ పాల్గొన్నారు. సదస్సులో అక్రిడిటేషన్ క్వాలిటీకి తీసుకోవల్సిన చర్యలపై యూకే నుండి హాజరైన డాన్ స్కిడ్‌మోర్, నేక్ సీనియర్ సలహాదారు ప్రొఫెసర్ లత పిళ్లై, కర్నాటక హెచ్‌ఈసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఎస్‌ఏ కోరి, నేక్ డిప్యుటీ సలహాదారు దేవేందర్ కవడే మాట్లాడారు. అక్రిడిటేషన్‌కు సంబంధించి అత్యుత్తమ విధానాలను , పద్ధతులను యుకే ఉన్నత విద్యాశాఖ ఫెలో ప్రొఫెసర్ రవీందర్ బర్న్, డీన్ ప్రొఫెసర్ ఏ రవీంద్రనాధ్ తదితరులు వివరిస్తారు. భవిష్యత్‌లో అక్రిడిటేషన్‌కు తీసుకోవల్సిన చర్యలు, మార్గదర్శనంపై ప్రొఫెసర్ బీ వెంకటేష్ కుమార్, ప్రొఫెసర్ సాబు థామస్, ప్రొఫెసర్ మోనా ఖరే, ప్రొఫెసర్ ఈ వాయునందన్, ప్రొఫెసర్ ఎన్వీరమణారావు, ప్రొఫెసర్ వైఎల్ శ్రీనివాస్ తదితరులు మాట్లాడతారు.
ముగింపు కార్యక్రమానికి డాక్టర్ ఉషా టైటస్ ముఖ్య అతిథిగా హాజరవుతారు. ఎన్‌బీఏ చైర్మన్ ప్రొఫెసర్ కే కే అగర్వాల్, ఏఐయూ సెక్రటరీ జనరల్ ప్రొఫెసర్ పంకజ్ మిట్టల్, రూసా నేషనల్ కోఆర్డినేటర్ ప్రొఫెసర్ బీ వెంకటేష్ కుమార్ తదితరులు ముగింపు కార్యక్రమంలో పాల్గొంటారని ప్రొఫెసర్ పాపిరెడ్డి పేర్కొన్నారు.

చిత్రం...అక్రిడిటేషన్ జాతీయ సదస్సులో బ్రోచర్‌ను ఆవిష్కరిస్తున్న ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి, కమిషనర్ నవీన్ మిట్టల్ తదితరులు