తెలంగాణ

వైఎస్ హయాంలో జనం సంతోషంగా ఉన్నారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 8: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో తెలుగు ప్రజలు సంతోషంగా ఉన్నారని కాంగ్రెస్ నాయకులు కొనియాడారు. తెలుగు రాష్ట్రాలు రెండింటిలో కాంగ్రెస్ అధికారంలో లేకపోయినా వైఎస్ ఆశయాలను కొనసాగించేందుకు ప్రయత్నం చేస్తామన్నారు. వైఎస్ జయంతిని పురస్కరించుకుని సోమవారం గాంధీభవన్, ఇందిరాభవన్‌లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు నివాళులు ఆర్పించారు. ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి మాట్లాడుతూ, వైఎస్ ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు అన్ని వర్గాల ప్రజలకు చేరాయన్నారు. ఉచిత విద్యుత్, విత్తనాలు, రుణమాఫీ, ఫీజు రియింబర్స్‌మెంట్, ఆరోగ్య శ్రీ తదితర పథకాలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచాయన్నారు. వీటిని ఇతర రాష్ట్రాలు కూడా అమలు చేస్తున్నాయన్నారు. విద్యా, ఉద్యోగాల కల్పనకు వైఎస్ అధిక ప్రాధాన్యత ఇచ్చారన్నారు. వైఎస్‌ను తెలుగు ప్రజలు ఎన్నటికీ మరిచిపోరన్నారు. వైఎస్ మంత్రివర్గంలో పని చేయడం తన అదృష్టంగా భావిస్తాన్నారు. టీపీసీసీ కోశాధికారి గూడూరు నారాయణరెడ్డి మాట్లాడుతూ, తెలంగాణలో వైఎస్ మెమోరియల్ నిర్మించాలన్నారు. ఈ అంశాన్ని సీఎం కేసీఆర్‌ను కలిసి చర్చించాలన్నారు. వైఎస్ ఎంతో మహోన్నత వ్యక్తి అని, ఆయన గురించి భవిష్యత్ తరాలకు తెలిసే విధంగా చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచందర్‌రావు, టీపీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, శాసనమండలి మాజీ నేత షబ్బీర్ అలీ, పార్టీ సీనియర్ నేతలు మల్లు రవి, కుసుమకుమార్, దాసోజు శ్రవణ్‌కుమార్, గిడుగు రుద్రరాజు, అంజన్‌కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

చిత్రం...పంజగుట్టలో వైఎస్సార్ విగ్రహం వద్ద నివాళులు అర్పిస్తున్న కేవీపీ, రఘువీరా, పొన్నాల తదితరులు