తెలంగాణ

పాఠశాల స్థాయి నుంచే పరిశోధనలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 8: ప్రాధమిక స్థాయి నుండి పునాదులు వేయకుండా ఉన్నత విద్యారంగంలో అకస్మాత్తుగా పెనుమార్పులు సాధ్యం కాదని, చదువంటే కేవలం ఉద్యోగం కోసమేనన్న భావన పోవాలని విద్యా శాఖా మంత్రి జగదీష్‌రెడ్డి పేర్కొన్నారు. ‘అక్రిడిటేషన్ - క్వాలిటీ- ర్యాంకింగ్ రోడ్ మ్యాప్ ’ అనే అంశంపై జరిగే రెండు రోజుల పాటు జరిగే జాతీయ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విద్య అంటే ఉద్యోగం కోసమే అనే ధోరణి పోవాలని, ప్రాధమిక స్థాయి నుండే పటిష్టమైన పునాదులు నెలకోల్పాలని చెప్పారు. సమాజ నిర్మాణానికి అవసరమైన విద్యను అందించాలని చెప్పారు. చదువంటే అంతా ఇంజనీరింగ్, మెడిసిన్ అనుకుంటున్నారని, అందుకే పరుగులు పెడుతున్నారని, చిన్న తనం నుండే పరిశోధనల జిజ్ఞాసను పెంచాలని అన్నారు. చదవడం, డబ్బు సంపాదించడం, అమెరికా వెళ్లడం ఇదే కార్యక్రమంగా పెట్టుకుంటున్నారని, అమెరికా వెళ్లడం తప్పులేదని అయితే వారిలో సామాజిక చైతన్యం, స్పృహ కూడా పెంచాలని చెప్పారు. తెలివైన వారంతా అమెరికా వెళ్లిపోతే దేశంలో పరిశోధనలను చేసేవారెవరుంటారు? ఆ దిశగా ఆలోచించాలని అన్నారు. విద్యారంగంలో త్వరలో సీఎం సమీక్షించనున్నారని విద్యామంత్రి చెప్పారు. సికింద్రాబాద్ పీజీ కాలేజీలో జరిగిన వేరొక కార్యక్రమంలో మంత్రి నూతన భవనాలను ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నత విద్యా ప్రమాణాలను పెంచాలన్నదే సీఎం సంకల్పమని అన్నారు. సుమారు 15 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించిన భవనాలను ప్రారంభించినట్టు చెప్పారు. ప్రపంచంలో ఎక్కడెక్కడ ఉన్నత విద్య బావుందో ఆ తరహాలో ఇక్కడ కూడా వాటిని పాటించాలని చూస్తున్నారని , ప్రామాణిక విద్య కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లకుండా ఆపాలన్నదే ప్రభుత్వ ధ్యేయమని అన్నారు.

చిత్రం... మాట్లాడుతున్న విద్యాశాఖ మంత్రి జగదీష్‌రెడ్డి