తెలంగాణ

విద్యారంగానికి రాజకీయ రంగు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 8: రాజకీయ జోక్యంతోనే విద్యారంగం గాడి తప్పిందని, ప్రపంచంలో అగ్రగామి వర్శిటీల్లో ఒక్కటి కూడా భారత్‌లో లేకపోవడం విచారకరమని నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వీ కే సారస్వత్ పేర్కొన్నారు. నాణ్యతా నిర్ధారణాంశంపై రెండు రోజుల పాటు జరిగే జాతీయ సదస్సులో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చిన సారస్వత్ సోమవారం పాత్రికేయులతో మాట్లాడారు. దేశంలో సమున్నత విద్యాసంస్థలు ఏర్పాటు కావల్సి ఉందని అన్నారు. క్వాలిటీ పెరగడంతో పాటు జీఈఆర్ కూడా పెరగాల్సి ఉందని చెప్పారు. చైనా లాంటి దేశాలు కూడా విద్యారంగంపై పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతున్నాయని, భారత్ కూడా ఆ దిశగా పయనించాల్సి ఉందని పేర్కొన్నారు. అమెరికా వంటి దేశాలకు మేథోవలస కొనసాగుతోందని, దానికి కారణం అక్కడి విద్యాసంస్థల్లో అత్యున్నత ప్రమాణాలేనని చెప్పారు. మేథో వలస ఆపాలంటే భారత్‌లో అత్యుత్తమ విద్యాసంస్థలను తయారుచేయాలి దాంతో పాటు మేథావులకు సరైన అవకాశాలను ఇక్కడే మనం సమకూర్చాలి అని వ్యాఖ్యానించారు. వౌలిక సదుపాయాల కల్పన, అనుకూల వాతావరణం సృష్టించడంతో పాటు ప్రమాణాలు కూడా పెరగాల్సి ఉందని అన్నారు. దేశంలో వేలాది వర్శిటీల్లో ఏళ్ల తరబడి లక్షలాది పీహెచ్‌డీలను ఇస్తున్నారని, వారు సమర్పించిన పీహెచ్‌డీల్లో ఉన్న పరిశోధనాంశాలు ముందుకు సాగుతున్నాయా? పరిశోధన అంశానికి సంబంధించిన పరికల్పనలు ఉత్పత్తుల రూపంలో వస్తున్నాయా అన్నది ఆలోచించాలని ప్రశ్నించారు. పరిశ్రమలు అత్యున్నత శాస్త్ర సాంకేతికతను అందిపుచ్చుకుని ముందుకు సాగుతోందని కృత్రిమ మేథస్సు, రోబోలు, యంత్రాలే అర్థం చేసుకునేంత వేగంగా పరిశ్రమల రంగం ముందుకు సాగుతోందని, అయితే, అంత వేగంగా విద్యారంగం ముందుకు సాగడం లేదని అన్నారు. ఒకపుడు ఇంజనీరింగ్ ఇతర విజ్ఞాన శాస్త్రాలకే గిరాకీ , ఉపాధి ఉండేదని, కాని పరిస్థితి ఇపుడు తారుమారైందని సామాజిక శాస్త్రాలు చదివేవారికి కూడా అవకాశాలు మెండుగా ఉన్నాయని అన్నారు. సేవల రంగం విస్తృతం కావడంతో ఆర్ట్సు విద్యార్థులకూ అవకాశాలు బాగా పెరిగాయని పేర్కొన్నారు. సాంకేతిక విద్యార్థులకు అవకాశాలు పెరగడానికి కారణం, ఆ రంగంపై ఎక్కువ దృష్టి సారించడమేనని, వారిలో విశే్లషణాత్మక లక్షణాలు ఎక్కువగా ఉండటమేనని చెప్పారు. దేశంలో ప్రపంచ శ్రేణి యూనివర్శిటీలు రాబోతున్నాయని, తద్వారా ఉన్నత విద్యారంగంలో పెనుమార్పులు సంభవించబోతున్నాయని అన్నారు.