తెలంగాణ

తాడోబా టైగర్ జోన్‌లో మూడు పులులు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్, జూలై 8: మహా రాష్ట్ర లోని పొరుగు చంద్రాపూర్ జిల్లా చిమ్మూర్ తాలూకా తాడోబా పులుల సంరక్షణ అటవీ ప్రాంతంలో ఒకే సంతతికి చెందిన మూడు పులులు మృతి చెందిన ఘటన అటవీశాఖలో అలజడి రేపింది. ఆసిఫాబాద్ కుమరం భీం జిల్లా ప్రాణహిత సరిహద్దు ఆవల గల చంద్రాపూర్ జిల్లా బ్రహ్మపురి అటవీ రేంజ్ పరిధిలో మూడు పులులు మృతి చెందిన కళేబరాలను సోమవారం అటవీ అధికారులు గుర్తించారు. వేటగాళ్లు ఓ పథకం ప్రకారం.. చంపిన ఆవును విషపూరిత రసాయనాల కళేబరంతో మేటేపార్ గ్రామసమీపంలో పులుల వేట కోసం ఎరవేయగా, వేటగాళ్ల ఉచ్చులో పడి ఆవు కళేబరాన్ని తిన్న పులులు అస్వస్థతకు గురై చని పోయినట్లు అనుమానిస్తున్నారు. మెటేపార్ గ్రామ సమీపంలో గల అటవీ ప్రాంతంలో గల నీటి కాలువ ఒడ్డున మూడు పెద్ద పులులు పడి ఉండడాన్ని గమనించిన స్థానికులు అటవీ అధికారులకు సమాచారం అందించారు. దీంతో అటవీ సిబ్బంది సోమవారం ఘటనా స్థలానికి చేరుకొని విచారణ జరపగా తల్లి పులితోపాటు రెండ మగ పులి పిల్లలు కూడా మృతి చెందినట్లు నిర్దారించారు. తాడోబా పులుల సంరక్షణ కేంద్రం పరిథి కాగజ్‌నగర్ అటవీడివిజన్ వరకు విస్తరించి ఉండడం గమనార్హం. ఒకేసారి మూడు పులులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంఘటన వణ్యప్రాణి అటవీ విభాగం అధికారుల కలకలం రేపుతుండగా, ఈ ఘటనపై అన్ని కోణాల నుండి విచారణ జరుపుతున్నామని చంద్రాపూర్ అటవీశాఖ డివిజనల్ ఫారెస్టు అధికారి కుల్‌రాజ్ సింగ్ తెలిపారు. పులులను శవ పరీక్ష నిమిత్తం వైల్డ్‌లైఫ్ ఫోరెన్సిక్ ల్యాబ్‌కు తరలించామని ఆయన తెలిపారు.