తెలంగాణ

అడవుల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 9: రాష్ట్రంలో అటవీ సంరక్షణ, అభివృద్ధి కోసం ప్రత్యేక ప్రణాళిక రూపొందించుకుని అమలు చేయాలని, రెవెన్యూ, పోలీస్ శాఖల సహకారం తీసుకోవాలని పలువురు రిటైర్డ్ అటవీ అధికారులు సూచించారు. అడవుల అభివృద్ధి కోసం రిటైర్డ్ అటవీ అధికారుల సలహాలు, సూచనలు తీసుకునేందుకు హైదరాబాద్‌లోని ‘అరణ్యభవన్’లో మంగళవారం ఒకరోజు సెమినార్ ఏర్పాటు చేశారు. దాదాపు 40 మంది రిటైర్డ్ అధికారులు ఈ సెమినార్‌లో పాల్గొని విలువైన సలహాలు, సూచనలు చేశారు. అటవీ శాఖ తాజాగా చేపట్టిన పథకాలు, కార్యక్రమాలను అదనపు అటవీ సంరక్షణ అధికారులు తొలుత పవర్ పాయింట్ ప్రెసెంటేషన్ ద్వారా వివరించారు. సామాజిక అడవుల పెంపకం, హరితహారం, కంపా (కంపెనే్సటరీ అఫార్‌స్టేషన్ ఫండ్ మేనేజ్‌మెంట్ అండ్ ప్లానింగ్ అథారిటీ) నిధులతో ప్రత్యామ్నాయ అటవీ పెంపకం, అభివృద్ధి పథకాల కోసం అటవీ భూముల మళ్లింపు, అటవీ భూముల ఆక్రమణలు, అటవీ హక్కుల గుర్తింపు పత్రాలు, అటవీ సిబ్బంది రక్షణ తదితర విషయాలపై సుదీర్ఘంగా చర్చ జరిగింది. ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వం అటవీ అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. సాగునీటి ప్రాజెక్టులకు కేటాయించిన అటవీ భూములు కాకుండా, సహజ అటవీ రక్షణకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని రిటైర్డ్ అటవీ అధికారి బీ.ఎస్. రావు సూచించారు. అటవీ పరిశోధనా సంస్థ (్ఫరెస్ట్ రీసెర్చ్) విభాగాన్ని పటిష్టం చేస్తూ, దీని ఫలితాలను అమలు చేయాలన్నారు. హరిత హారంలో నాణ్యమైన మొక్కలను మాత్రమే ప్రజలకు ఇవ్వాలని సూచించారు. అటవీ భూముల పరిరక్షణకు ఆధునిక సాంకేతిక విజ్ఞానాన్ని ఉపయోగించుకోవాలని, గూగుల్ టైమ్‌లైన్ మ్యాపులు, శాటిలైట్ సర్వేలపై ఆధారపడాలన్నారు. సాంప్రదాయ పద్ధతైన బీట్ అధికారి కాలినడకన పర్యవేక్షణ (్ఫట్ పెట్రోలింగ్) అటవీ భూముల రక్షణకు తోడ్పడుతుందన్నారు. రెవెన్యూ శాఖతో అటవీ భూముల రికార్డులను సరిచూసుకుంటూ ఉండాలని, ఖచ్చితమైన సరిహద్దులను గుర్తించి, పోలీసుల సహకారంతో రక్షణ ఏర్పాట్లు చేయాలన్నారు. గ్రామ పంచాయతీలను అటవీ రక్షణకు బాధ్యులుగా మార్చాలని పలువులు రిటైర్డ్ అధికారులు సూచించారు. రిటైర్డ్ అయిన అత్యంత సీనియర్ అటవీ అధికారి టి. కృష్ణమూర్తి (94), బుచ్చిరామిరెడ్డి (87), బీఎస్ రావు, బి. సోమశేఖరరెడ్డి, ఎస్‌డీ ముఖర్జీ, కేడీఆర్ జయకుమార్, ఓంకార్‌సింగ్‌లతోపాటు 40 మంది మాజీ అధికారులతో సెమినార్ కళకళలాడింది. పీసీసీఎఫ్ పీ.కే. ఝా, పీసీసీఎఫ్‌లు పృథ్వీరాజ్, శోభ, అదనపు పీసీసీఎఫ్‌లు మునీంద్ర, లోకేష్ జైస్వాల్, డోబ్రియాల్, శ్రీనివాస్ అధికారులు పాల్గొన్నారు.