తెలంగాణ

కర్ణాటక ప్రభుత్వం మునిగిపోతున్న నావ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భువనగిరి, జూలై 9: రాహుల్‌గాంధీ హయాంలో కాంగ్రెస్‌పార్టీ భవిష్యత్తు అంధకారంగా మారిందని ఆ ప్రభావంతోనే కర్ణాటకలో కాంగ్రెస్, జేడీఎస్ ప్రభుత్వం మునిగిపోతున్న నావలా మారిందని భారతీయ జనతాపార్టీ జాతీయ కార్యదర్శి మురళీధర్‌రావు అన్నారు. మంగళవారం యాదాద్రి భువనగిరి జిల్లాకేంద్రం భువనగిరిలో ఏర్పాటుచేసిన బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ అధిష్టానంపై నమ్మకంలేకే సీనియర్ నాయకులు సైతం ఆ పార్టీని వీడుతున్నారని అన్నారు. కర్నాటక రాష్ట్రంలో కాంగ్రెస్ జేడీఎస్‌లతో అభివృద్ధి సాధ్యంకాదని ప్రజలు నమ్ముతున్నారని ఆయన స్పష్టంచేశారు. కాంగ్రెస్ పార్టీ కనుమరుగయ్యే పార్టీగా ఆయన వ్యాఖ్యానించారు. కర్ణాటకలో ప్రభుత్వం ఉంటుందా, కూలుతుందా అన్న విషయం స్పీకర్‌పై ఆధారపడి ఉంటుందని దానిలో బీజేపీ ప్రమేయం శూన్యమన్నారు.
రాష్ట్రంలో కాంగ్రెస్, టీఆర్‌ఎస్ మ్యాచ్‌ఫిక్సింగ్
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్, టీఆర్‌ఎస్ మ్యాచ్‌ఫిక్సింగ్‌కు పాల్పడ్డాయని కాంగ్రెస్ పార్టీలో గెలిచివచ్చిన వారికి టీఆర్‌ఎస్ ప్రభుత్వం మంత్రి పదవులు కట్టబెడితే బయటనున్నవారు లోపాయకారీగా టీఆర్‌ఎస్‌కు వత్తాసు పలుకుతున్నారని మురళీధర్‌రావు విమర్శించారు. టీఆర్‌ఎస్ నిరంకుశ విధానాలను కాంగ్రెస్‌పార్టీ నిలదీయలేకపోతోందని మురళీధర్‌రావు విమర్శించారు. కుటుంబపాలన నేపథ్యంతో కొనసాగుతున్న టీఆర్‌ఎస్ పార్టీ ప్రజాస్వామ్య, అభివృద్ధి వ్యతిరేక విదానాలు అవలంబిస్తోందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నిధులను దారిమళ్లించి కమీషన లకోసం కక్కుర్తి ప్రదర్శిస్తోందన్నారు. గతేడాది తాగునీటికి 5 వేల కోట్లు బడ్జెట్‌లో కేటాయించి నిధులు విడుదల చేస్తే ఈ ఏడాది 10 వేల కోట్లు కేటాయించిందన్నారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిలదీస్తూ ప్రజాక్షేత్రంలో ఎండగట్టాలన్న సంకల్పంతోనే భారతీయ జనతాపార్టీ పోరాటాలకు సమాయుత్తమవుతోందన్నారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం భారతీయ జనతాపార్టీయేనని ఆయన పేర్కొన్నారు. ప్రపంచంలో అతిపెద్ద అంతర్గత ప్రజాస్వామ్యం కలిగిన ఏకైకపార్టీగా భారతీయ జనతాపార్టీ ఆవిర్భవించిందని మురళీధర్‌రావు అన్నారు. రాష్ట్రంలో గతేడాది 18లక్షల సభ్యత్వాలున్న భారతీయ జనతాపార్టీ రెట్టింపు సభ్యత్వాలు అనగా 36 లక్షల సభ్యత్వాల నమోదు లక్ష్యంతో ముందుకెళ్తుందన్నారు. పర్యటనలో స్వచ్చ్భారత్ కార్యక్రమంలో భాగంగా రాయిగిరి గ్రామంలో మొక్కలు నాటారు. బీజేపి యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు పివి.శ్యాంసుందర్‌రావు, రాష్ట్ర నాయకులు దాసరి మల్లేశం, పాశం భాస్కర్, వేముల అశోక్, సుర్వి శ్రీనివాస్‌గౌడ్, పడమటి జగన్మోహన్‌రెడ్డి, చందామహేందర్‌గుప్త, సుర్వి లావణ్య, రత్నపురం బలరాం పాల్గొన్నారు.
చిత్రం... భువనగిరిలో విలేఖరుల సమావేశంలో మాట్లాడుతున్న బీజేపీ జాతీయ కార్యదర్శి మురళీధర్‌రావు