తెలంగాణ

టీఆర్‌ఎస్‌కు ‘సోమారపు’ రాజీనామా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గోదావరిఖని, జూలై 9: రాజకీయ సన్యాసం తీసుకోబోతున్నట్టు గతంలోనే సంచలన ప్రకటనలు చేసి... ఆ తరువాత మళ్లీ పార్టీలో కొనసాగుతూ వచ్చిన ఆర్టీసీ మాజీ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ ఎట్టకేలకు టీఆర్‌ఎస్ పార్టీకి గుడ్‌బై చెప్పారు. ఉద్యమాలతో ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితిలో క్రమశిక్షణ కరవైపోయిందని... స్థానికంగా అరాచకత్వం పెరిగిపోయిందని ఆరోపిస్తూ అందుకే తాను టీఆర్‌ఎస్ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు మంగళవారం పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో రాజీనామా విషయాన్ని స్పష్టం చేస్తూ తన రాజీనామా లేఖను రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌కు పంపినట్టు తెలిపారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అధిష్టానం తనకు రామగుండం నుంచి టిక్కెట్ ఇచ్చినప్పటికీ కొందరు బడా నేతలు తనను ఓడించేందుకు కుట్రలు పన్నారని మండిపడ్డారు. ఇక్కడ మున్సిపల్ చైర్మన్‌గా, రెండు పర్యాయాలు శాసనసభ్యునిగా కొనసాగినంత కాలం అభివృద్ధికి కట్టుబడి పనిచేసానని, టీఆర్‌ఎస్‌లో చేరినప్పటి నుంచి అధినేత కేసీఆర్ అప్పగించిన ప్రతి బాధ్యతను నిబద్ధతతో పూర్తి చేస్తూ వచ్చానని గుర్తు చేశారు. రామగుండం టీఆర్‌ఎస్‌లో అరాచకత్వం పెరిగిపోయందని, తన అనుచరగణంపై పోలీసుల ద్వారా దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని సత్యనారాయణ ఆరోపించారు. రామగుండంలో తమకు కనీసం పార్టీ సభ్యత్వాల బుక్కులు కూడా ఇవ్వడం లేదని, తమను పార్టీ నుంచి వీడేలా పరోక్షంగా కూడా అవమానాలకు గురి చేశారని ఆయన ఆరోపించారు. భవిష్యత్‌లో ఏ రాజకీయ పార్టీలో చేరబోతున్నారన్న ప్రశ్నకు మాత్రం సోమారపు సత్యనారాయణ ఇంకా ఏ పార్టీలో చేరేది నిర్ణయం కాలేదని, త్వరలో చెబుతానని దాట వేశారు. సత్యనారాయణతో పాటు మరో 32 మంది నాయకులు కూడా టీఆర్‌ఎస్‌కు రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. కోదాటి ప్రవీణ్, మందల క్రిష్ణారెడ్డి, పిడుగు క్రిష్ణ, ధరణి జలపతి, బాలసాని తిరుపతి, నారాయణ రెడ్డి, నీరటి శ్రీనివాస్, మంచికట్ల బిక్షపతి, సుభాష్, శ్రీనివాస్, శ్రీ్ధర్ తదితరులున్నారు.

చిత్రం...విలేఖరులతో మాట్లాడుతున్న ఆర్టీసీ మాజీ చైర్మన్ సత్యనారాయణ