తెలంగాణ

సామాజిక మార్పునకు యువత కృషి చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, జూలై 9: సామాజిక మార్పుకు, దేశ భవిష్యత్‌కు యువతరం ముందుండాలని, కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా సీపీఎం నిర్వహించే ప్రజాపక్ష ఉద్యమాల్లో యువత కలిసిరావాలని పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పిలుపునిచ్చారు. మంగళవారం జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల సీపీఎం యువజన సంఘాల సమ్మేళనంలో ఆయన మాట్లాడుతు ప్రజా సమస్యలపైన, సమకాలిన రాజకీయ, పాలన వైఖరులపైన యువత దృష్టి సారించాలన్నారు. పార్టీకి సంబంధించిన యువజన విభాగాలు పార్టీ సిద్ధాంతాలను ఇతర యువతీయువకులకు, విద్యార్థులకు అవగాహన పరిచి వారిని పార్టీ నిర్మాణంలో భాగస్వామ్యం చేసేందుకు కృషి చేయాలన్నారు. దేశ భవిష్యత్, సామాజిక రాజకీయ మార్పులు యువత చేతుల్లోనే ఉన్నాయని, వారిని ఈ దిశగా చైతన్య పరిచేందుకు, పార్టీ నిర్మాణంలో యువతను భాగస్వామ్యం చేసేందుకు పార్టీ యువజన విభాగాలు చొరవ చూపాలన్నారు. పార్టీ రిక్రూట్‌మెంట్‌కు, సంస్థాగత బలోపేతానికి యువత, విద్యార్ధి భాగస్వామ్యం కీలకమన్న విషయాన్ని అంతా గ్రహించాలన్నారు. సమస్యల ప్రాతిపదిపదికన, అంశాల వారీగా, స్థానిక పరిస్థితుల క్రమంలో యువతరాన్ని కదిలించడం ద్వారా పార్టీ విద్యార్ధి, యువజన విభాగాల పటిష్టతకు ప్రయత్నించాలన్నారు. నరేంద్ర మోదీ పాలనలో దేశంలో నిరుద్యోగం పెరిగిపోయిందని, ఉపాధి అవకాశాలు సన్నగిల్లాయన్నారు. కేంద్ర ప్రభుత్వం దేశ భవిష్యత్‌ను, యువత భవిష్యత్‌ను కార్పొరేట్‌కు తాకట్టు పెట్టి 275 ప్రభుత్వ సంస్థలను ప్రైవేటీకరించేందుకు సిద్ధపడిందన్నారు. బీఎస్‌ఎన్‌ఎల్, రైల్వే, ఎయిర్‌వేస్‌లను సైతం ప్రైవేటుకు కట్టబెడుతోందన్నారు. దేశ సంపదను ప్రైవేటుకు దోచిపెడుతోందన్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాలు దేశ యువతకు, విద్యార్ధికి, మధ్యతరగతి, సామాన్య పేదలకు వ్యతిరేకంగా ఉన్నాయన్నారు. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో అభివృద్ధి చెందామంటూనే చంద్రయాన్ ప్రచారం సాగిస్తునే మూఢ నమ్మకాలను, మతోన్మాద వైఖరులను ప్రొత్సహిస్తున్నారన్నారు. ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొడుతున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సైతం అపజ్రాస్వామిక, రాచరిక పోకడలతో రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తుందన్నారు. మన నీళ్లు, నిధులు, ఉద్యోగాల పేరుతో తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నప్పటికీ సీఎం కేసీఆర్ పాలనలో వీటిలో ఏ ఒక్కటీ అమలు కావడం లేదన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రజావ్యతిరేక విధానాలపై యువత చైతన్యవంతంగా వ్యవహరించాల్సివుందన్నారు. దేశ పునర్‌నిర్మాణానికి, ప్రభుత్వ సంస్థల పరిరక్షణకు, ప్రజాహక్కుల రక్షణకు సీపీఎం, అనుబంధ సంస్థలు సాగించే పోరాటాల్లో యువత భాగస్వామ్యం కావాలని కోరారు. సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు, నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి జిల్లాల సీపీఎం జిల్లా కార్యదర్శులు ముదిరెడ్డి సుధాకర్, ముల్కపల్లి రాములు, ఎండి జహంగీర్, డీవైఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షుడు విజయకుమార్, కార్యదర్శి విప్లవ్‌కుమార్, నాయకులు తుమ్మల వీరారెడ్డి, పాలడుగు నాగార్జున, నారి ఐలయ్య, డీవైఎఫ్‌ఐ, ఎస్‌ఎఫ్‌ఐ మూడు జిల్లాల కార్యదర్శులు, నాయకులు పాల్గొన్నారు.
చిత్రం...మూడు జిల్లాల సీపీఎం యువజన సంఘాల సమ్మేళనంలో మాట్లాడుతున్న పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేనీ వీరభద్రం