తెలంగాణ

కాళేశ్వరం తెలంగాణ అదృష్టం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉగ్ర మాతగా
భద్రకాళి అమ్మవారు
వైభవంగా సాగుతున్న శాకంబరి ఉత్సవాలు
ఆంధ్రభూమి బ్యూరో
వరంగల్, జూలై 9: వరంగల్ మహా నగరంలో ప్రసిద్ధి గాంచిన పుణ్యక్షేత్రం భద్రకాళి అమ్మవారి సన్నిధానంలో శాకంబరి నవరాత్రి మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలు మంగళవారం నాటికి ఏడవ రోజుకు చేరుకున్నాయి. ఉదయం 5 గంటలకు నిత్యాహ్నకం పూర్తి చేసిన తర్వాత అమ్మవారి ఉత్సవ మూర్తులలో ఇచ్ఛాశక్తిని ఉగ్రమాతగాను, జ్ఞానశక్తిని శివదూతీ మాతగాను అలంకరించి పూజారాధనలు జరిపారు. దశమహావిద్యలలో ఆద్య విద్యయైన కాళీ సవర్య క్రమంలో సప్తమికి అధి దేవత ఉగ్రా. ఈ ఉగ్రా దేవి కాళిక అమ్మవారి భక్తుల పట్ల ప్రతిపక్తులు ఈర్ష్యాద్వేషములతో జరిపే అభిచారాది కృత్యములు అనగా ప్రయోగాది రూపేణా బాధలు పెట్టే వారిని ధ్వంసం చేస్తుంది. ఉగ్రా అమ్మవారి చేతియందు సర్వము, ఢమరుకం, త్రిశూలం, కపాలం ఇత్యాది భయంకరమైన ఆయుధములను కలిగి దుష్టశక్తుల సంహారం చేసి భద్రకాళి భక్తులను ఎల్ల వేళలా కాపాడుతుంది. అదే విధంగా జగన్మాత కాళిక రాక్షసంహారం చేస్తున్న సందర్భంగా రాక్షస సొదరులైన శుంభ, నిశుంభులకు హితోపదేశం చేయడానికి శివుడిని దూతగా పంపిస్తుంది. అప్పుడు ఆమెకు శివదూతీ అన్న పేరు ప్రసిద్ధమైంది. ఈ శివదూతీ అమ్మవారు భక్తులకు విజయాన్ని కలిగిస్తూ ముక్తికి హేతువతుందని ఆలయ ప్రధానార్చకుడు భద్రకాళి శేషు తెలిపారు.
ఉగ్ర మాత అలంకరణలో అలరిస్తున్న
వరంగల్ భద్రకాళి అమ్మవారు

మహదేవ్‌పూర్/కాళేశ్వరం, జూలై 9: ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకం కాళేశ్వరం ప్రాజెక్టు అని, అహోరాత్రులు శ్రమించి నిర్మించిన ఈ ప్రాజెక్టు ప్రారంభం కావడం తెలంగాణ ప్రజల అదృష్టమని, పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సంతోషం వ్యక్తం చేశారు. మంగళవారం కాళేశ్వరం ప్రాజెక్టులో అతికీలకమైన కనె్నపల్లి పంపుహౌస్, మేడిగడ్డ బ్యారేజీలను ఆయన సందర్శించారు. కనె్నపల్లిలోని పంపుహౌస్‌ల మోటార్ల పనితీరును పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచంలోనే అమెరికా, కెనడాలో రెండు ఎత్తిపోతల పథకాలు ఉన్నాయని, వాటికి దీటుగా తెలంగాణలో 618 మీటర్ల ఎత్తుకు నీటిని పోయడం అసాధారణమైందని, అయనా ఈ బృహత్తర కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు స్వయంగా స్క్రీన్‌ప్లే దర్శకత్వం నిర్మాత అన్నీ తానే అయి మొక్కవోని దీక్షతో పట్టువదలని సంకల్పంతో దీనిని నెరవేర్చారని మంత్రి దయాకర్‌రావు కొనియాడారు. మొదట్లో ప్రాజెక్టు ప్రారంభించినప్పుడు ప్రతిపక్షాలు అనవసర ప్రాజెక్టు అంటూ యాగీ చేశాయని, ఆ తరువాత నిర్మాణం పాతికేళ్లయినా పూర్తికాదని చిలుకపలుకులు చెప్పారని ఆయన ఎద్దేవా చేశారు. వీటన్నింటికీ తనపని తీరే ప్రమాణికమని భావించిన కేసీఆర్ పట్టువదలని విక్రమార్కుడిలా కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని అత్యంత కీలకమైన మేడిగడ్డ, కనె్నపల్లి పంపుహౌస్, అన్నారం, సుందిల్ల బ్యారేజీలు, పంపులు, టనె్నళ్లు పూర్తికాగా మరికొన్ని రిజర్వాయర్ల పనులు తుదిదశకు వచ్చాయని మంత్రి వివరించారు. ఈరోజు కనె్నపల్లి వద్ద మూడు మోటార్ల ద్వారా దిగువ నుండి ఎగువకు వేలాది క్యూసెక్కుల నీటిని ఎత్తిపోసి కెనాల్ గుండా అన్నారం బ్యారేజీని నింపుతున్నామని, వచ్చే కొద్దిరోజుల్లో మొత్తం 11 మోటార్లు ఏకధాటిన నడిపించేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని ఆయన తెలిపారు. రోజుకు 2 టీఎంసీల నీటిని ఎత్తిపోతే కాళేశ్వరం ప్రాజెక్టుకు మరింత విస్తృతపరిచి 3 టీఎంసీల నీటిని ఎత్తిపోసేందుకు ముఖ్యమంత్రి కంకణబద్దుడై ఉన్నాడని ఆయన అన్నారు. తెలంగాణలోని ప్రతి ఎకరానికి సాగునీటిని, ప్రతి కుటుంబానికి తాగునీటిని అందించాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనా విధానాన్ని ఈ రోజు కేంద్ర ప్రభుత్వం కూడా అమలుచేయబూనిందంటే కేసీఆర్ గొప్పతనాన్ని ఇప్పటికైనా ప్రతిపక్షాలు అర్ధం చేసుకోవాలని మంత్రి దయాకర్‌రావు అన్నారు. అనంతరం మేడిగడ్డ బ్యారేజీకి చేరుకుని వంతెనపై గోదావరి నది ప్రవాహాన్ని వీక్షించారు. ఆయన వెంట ఎమ్మెల్యేలు గండ్ర వెంకటరమణారెడ్డి, పెద్ది సుదర్శన్‌రెడ్డి, చల్లా ధర్మారెడ్డి, భూపాలపల్లి జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు, పెద్దపల్లి జడ్పీచైర్మన్ పుట్టా మధూకర్, భూపాలపల్లి జిల్లా జడ్పీచైర్‌పర్సన్ జక్కు.శ్రీహర్షిణి, వైస్ చైర్మన్ శోభ, కాటారం మార్కెట్ కమిటీ చైర్మన్ లింగంపల్లి శ్రీనివాసరావు, కాళేశ్వరం ఎంపీటీసీ రేవెల్లి మమతనాగరాజు ఉన్నారు.
చిత్రం...గ్రావిటీ కెనాల్‌ను పరిశీలిస్తున్న మంత్రి దయాకర్‌రావు, ఎమ్మెల్యేలు