తెలంగాణ

చరిత్రను వెలికితీయడానికి రాతప్రతులే మేలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాచారం, జూలై 11: చరిత్రను వెలికితీయడానికి రాతప్రతులతో ఉపయోగపడుతాయని తెలంగాణ గ్రంథాలయ చైర్మన్ డాక్టర్ ఆయచితం శ్రీ్ధర్ అన్నారు. గురువారం ఉస్మానియా యూనివర్సిటీలో తెలంగాణ ప్రాచ్య లిఖిత గ్రంథాలయంలో రాతప్రతులపై ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. విశ్య విద్యాలయాల్లో ఉండే అన్ని విభాగాలకు రాతప్రతుల సంస్థలకు మధ్య అనుసంధానం తప్పనిసరి అని పేర్కొన్నారు. ఈ ప్రతులపై అవగాహనతో పాటు పరిశోధనలు చేయడానికి కూడా ముందుకు రావాలని కోరారు. రాతప్రతులతో ఎన్నో విషయాలు వెలుగులోకి రాగలవని ఆశాభావం వ్యక్తం చేశారు. ఐటీ విభాగం సంయుక్త కార్యదర్శి పెండ్యాల శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రాచీన రాతప్రతుల్లో ఎన్నో శాస్త్రాలు ఉన్నాయని, ఏ సంస్థలలో ఏయే అంశాలు ఉన్నాయనే విషయం పరిశోధనలతో బయటపడుతాయని తెలిపారు. ఒకప్పుడు రాతప్రత్రుల అధ్యయనం చాలా కష్టతరంగా ఉండేదని, ప్రస్తుతం సాంకేతిక పరిజ్ఞానంతో సులభతరమైందని చెప్పారు. డాక్టర్ పోలం సుబ్బారావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో డాక్టర్ ప్రత్తిపాక మోహన్, ఆచార్య రామేశ్వరం పాల్గొన్నారు.