తెలంగాణ

బడ్జెట్‌కు వ్యతిరేకంగా 15న ఏఐటీయూసీ ధర్నాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 11: కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పూర్తిగా కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా కార్మిక వర్గానికి వ్యతిరేకంగా ఉందని, మూడు లక్షల కోట్ల బడ్జెట్‌లో కార్మికులకు ఎలాంటి ప్రయోజనం లేకుండా ఉందని ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధానకార్యదరిశ వీ ఎస్ బోస్ విమర్శించారు. గురువారం నాడు జరిగిన కార్యవర్గ సమావేశంలో బోస్ మాట్లాడుతూ రెండోసారి అధికారంలోకి వచ్చిన కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో కార్మికులకు ఎలాంటి లాభం లేకపోగా, పెట్రోల్, డీజిల్ లాంటి చమురు ధరలను పెంచడం ద్వారా పేద, మధ్య తరగతి ప్రజలపై భారాన్ని మోపడం జరిగిందని అన్నారు. కార్మిక వ్యతిరేక, పెట్టుబడిదారీ అనుకూల బడ్జెట్‌ను నిరసిస్తూ ఎఐటీయూసీ జాతీయ సమితి ఇచ్చిన పిలుపులో భాగంగా రాష్ట్రంలో ఈ నెల 15, 16, 17 తేదీల్లో నిరసన కార్యక్రమాలు చేపడతామని అందులో భాగంగా 16వ తేదీన ఇందిరా పార్కువద్ద భారీ నిరసన ధర్నా చేపడతామని చెప్పారు.