తెలంగాణ

డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణంలో నాణ్యతకు తిలోదకాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గద్వాల, జూలై 11: జోగుళాంబ గద్వాల జిల్లాలో ఆరేళ్లుగా ఒక్క ఇంటి నిర్మాణం పూర్తిచేయకుండా కేవలం ఎన్నికల సమయంలో ప్రజలను మభ్యపెట్టేందుకు తెరాస నేతలు డబుల్‌బెడ్‌రూంల నాటకాలకు తెరలేపుతున్నారని మాజీ మంత్రి, బీజేపీ నాయకురాలు డీకే అరుణ మండిపడ్డారు. గురువారం పట్టణ సమీపంలోని దౌదర్‌పల్లి దర్గా వద్ద నిర్మిస్తున్న డబుల్‌బెడ్‌రూంలను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా నిర్మాణాలలో వాడుతున్న ఇసుక, కంకర, సిమెంటు, కడ్డి, పునాదుల తీత, నిర్మాణాలలో నాణ్యతకు తిలోదకాలు ఇచ్చారని ఆరోపించారు. 2500 డబుల్ బెడ్‌రూమ్‌లు నిర్మిస్తున్నామని ఎన్నికల్లో ఓట్లేసి గెలిపిస్తే లబ్దిదారులకు ఇస్తామంటూ 25వేల మంది ఓటర్లను డబుల్‌బెడ్‌రూంల నిర్మాణాల చుట్టూ తిప్పుతున్నారని, దిగజారుడు, ఓటర్లను ప్రలోభపెట్టి అబద్ధాలు చెప్పే నీతిమాలిన రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. గతంలో తాము మంత్రిగా ఉన్నప్పుడు నిరుపేదలకు ప్లాట్ల పంపిణీ కోసం ఇక్కడ పొలాన్ని కొనుగోలు చేయడం జరిగిందని, ప్రభుత్వం అందించిన పరిహారం సరిపోక పోవడంతో తాముకూడ సొంతంగా డబ్బులు చెల్లించామని గుర్తుచేస్తూ సొంతంగా డబుల్‌బెడ్‌రూంకు స్థలాన్ని సేకరించలేని దద్దమ్మలు నిరుపేదల ప్లాట్లలో నాసిరకం ఇళ్లు కడుతూ ప్రజలను మోసగిస్తున్నారని మండిపడ్డారు.
కేవలం 468 ఇండ్ల నిర్మాణం మాత్రమే జరుగుతుందని, వాటిలో సగభాగం బేస్‌మెంట్లు, పిల్లర్ల దశలోనే ఉన్నాయని, 50 ఇండ్లు మాత్రం ప్లాస్టర్లు పూర్తయ్యాయని, ఈ ఏడాది నవంబర్ చివరి నాటికి లబ్ధిదారులకు అందించే అవకాశాలు ఉన్నాయని అక్కడి సైట్ ఇంజనీర్లు తెలియజేశారు. అదేవిధంగా గద్వాల మార్కెట్‌యార్డులో రైతుల ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసి పోలీస్‌స్టేషన్ నిర్మించడం, ఇప్పుడు టీఆర్‌ఎస్ కార్యాలయం నిర్మాణానికి పూనుకోవడం చట్టవిరుద్ధమని మండిపడ్డారు.