తెలంగాణ

మేడిగడ్డ బ్యారేజీ వద్ద గోదావరికి జలకళ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహదేవ్‌పూర్, జూలై 11: తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టు జిల్లాలోని మహదేవ్‌పూర్ మండలంలోని మేడిగడ్డ బ్యారేజీ వద్ద గురువారం గోదావరి నదికి జల కళ సంతరించుకుంది. ఎగువన మహారాష్టల్రో కురుస్తున్న భారీ వర్షాల వల్ల ప్రాణహిత నదిలోకి నీటి ప్రవాహం రావడంతో కాళేశ్వరం వద్ద గోదావరి ప్రవాహం క్రమేణా పెరుగుతోంది. దీంతో మేడిగడ్డ బ్యారేజీ వద్ద గోదావరి నీటి మట్టం 93.5 లెవల్‌కు చేరింది. బ్యారేజీకి 6 మీటర్ల మేర నీటి నిల్వ ఉంది. బ్యారేజీకి 85 గేట్లను ముందస్తుగా అధికారులు మూసివేశారు. మేడిగడ్డకు అత్యంత కీలకమైన కనె్నపల్లి పంపుహౌస్‌లో ఇప్పటికీ నాలుగు మోటార్లు నీటిని ఎత్తిపోస్తున్నాయి. దీంతో గ్రావిటీ కెనాల్ ద్వారా ఇప్పటి వరకు 20వేల క్యూసెక్కుల నీరు అన్నారం బ్యారేజీలోకి చేరుతుంది.
అన్నారం బ్యారేజీ వద్ద ప్రస్తుతం 7 మీటర్ల లెవల్‌లో నీరు చేరుకుంది. అన్నారం బ్యారేజీ నుండి బ్యాక్ వాటర్ పంపుహౌస్ వద్దకు 33 కిలో మీటర్ల మేర ఉండగా ప్రస్తుతం అన్నారం బ్యారేజీ బ్యాక్ వాటర్ 22 కిలో మీటర్లు చేరుకుందని అధికారులు తెలిపారు. కనె్నపల్లి పంపుహౌస్‌లో 5వ మోటార్‌ను రన్ చేయడానికి అధికారులు సిద్ధమవుతున్నట్లు సమాచారం.