తెలంగాణ

మున్సి‘పోల్స్’లో అధిక సీట్లే లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 11: త్వరలో జరగనున్న మున్సిపాలిటీ ఎన్నికల్లో వీలైనన్ని ఎక్కువ సీట్లు గెలుచుకునే దిశగా బీజేపీ ముమ్మరంగా కసరత్తును ప్రారంభించింది. పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంతో పాటు 140 మున్సిపాలిటీల్లో అర్హులైన అభ్యర్థుల కోసం వేటను ముమ్మరం చేసింది. రాష్ట్రంలో వరంగల్, నిజామాబాద్, కరీంనగర్, రామగుండం, మంచిర్యాల నగర పాలక సంస్థల్లో కాషాయ జెండా ఎగురవేసేందుకు ప్రణాళికలను బీజేపీ రూపొందించుకుంటోంది. మున్సిపాలిటీల సంగతికి వస్తే సిరిసిల్ల, వేములవాడ, రాయికల్, జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి, ధర్మపురి, మంథని, గోదావరిఖని, పెద్దపల్లి, కామారెడ్డి, బాన్స్‌వాడ, ఎల్లారెడ్డి, సిర్పూర్ కాగజ్‌నగర్, మహబూబ్‌నగర్, గద్వాల తదితర మున్సిపాలిటీలను కైవశం చేసుకునేందుకు వీలుగా పోలింగ్ బూత్ స్థాయిని నుంచి పార్టీని పటిష్టం చేస్తున్నారు. తాజా పార్లమెంటు ఎన్నికల్లో నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ సీట్లను బీజేపీ కైవశం చేసుకున్న సంగతి విదితమే. అందుకే ఈ లోక్‌సభ సీట్ల పరిధిలో ఉన్న మున్సిపాలిటీలను చేజిక్కించుకుని తమ సత్తాను చాటాలని బీజేపీ ఉవీళ్లూరుతోంది. గత వారం వచ్చిన పార్టీ అధ్యక్షుడు,కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా హైదరాబాద్‌కు వచ్చినప్పుడు పార్టీ సీనియర్లతో అంతరంగికంగా సమావేశాన్ని నిర్వహించారు. వచ్చే నెల ఆగస్టులో అమిత్ షా రాష్ట్రానికి రానున్నారు. ఈ సారి ఉత్తర తెలంగాణలో బహిరంగ సభను నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో ఎక్కువస్థానాలను గెలుచుకునేందుకు వీలుగా అవసరమైన వ్యూహాన్ని ఖరారు చేసేందుకు 20 మంది నేతలను పార్టీ అధిష్ఠానం గుర్తించింది. పట్టణ ప్రాంతాల్లో బలంగా ఉన్నామని, బూత్‌స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయాలని అమిత్‌షా ఆదేశించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ప్రతి బూత్ పరిధిలో పది మంది యువ కార్యకర్తలను నియమించాలని పార్టీకి సూచించారు. మహిళా కార్యకర్తలకు కీలక బాధ్యతలు అప్పగించాలని సూచించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. బీజేపీ అంటే అందరి పార్టీ అనే అభిప్రాయాన్ని కల్పించి అన్ని వర్గాలను చేర్చుకోవాలని పార్టీకి అమిత్‌షా నిర్దేశించారు. హైదరాబాద్ పరిసరాల్లో మైనారిటీలు ఎక్కువగా ఉన్నారని, వారికి పార్టీ సిద్ధాంతాలపై అవగాహన కల్పించి లక్ష మందిని చేర్చుకుని పార్టీ సభ్యత్వం ఇచ్చేందుకు బీజేపీ ప్రణాళికను రూపొందించింది. మైనారిటీల్లో ఉన్నత వర్గాలు బీజేపీలో చేరేందుకు మొగ్గు చూపుతున్నారు.