తెలంగాణ

అతిచిన్న కోడిగుడ్డు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భూపాలపల్లి, జూలై 12: సాధారణంగా కోడిగుడ్డు బరువు 40 నుంచి 49 గ్రాముల బరువుంటుంది. అయతే జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని కారల్‌మార్క్స్‌కాలనీలో నివాసం ఉంటున్న కోల్లోజు శంకరయ్య వజ్రమణి దంపతుల ఇంట్లోని కోడి శుక్రవారం అతిచిన్న సైజు కోడిగుడ్డును పెట్టింది. గత ఐదు సంవత్సరాలుగా కోళ్లు పెంచుకుంటున్న శంకరయ్య దంపతులు తమ ఇంట్లోని కోడి మామూలు కోడిగుడ్డు సైజు కన్నా కేవలం పది గ్రాముల బరువుతోనే గుడ్డును పెట్టడంతో ఆశ్చర్యపోయారు. గత వారంలో పెట్టిన గుడ్లతో పోలిస్తే ఈ కోడిగుడ్డు మరింత చిన్నదిగా కనిపించడంతో కాలనీవాసులు వింతగా తిలకించి ఫొటోలు తీసుకున్నారు.
చిత్రం... కోడి పెట్టిన గుడ్డును చూపిస్తున్న వజ్రమణి