తెలంగాణ

తెలంగాణలో బలమైన రాజకీయశక్తి బీజేపీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూర్యాపేట, జూలై 12: కేంద్రంలో రెండవసారి అధికారం చేపట్టి అఖండ విజయాన్ని సాధించిన బీజేపీ తెలంగాణలోనూ బలమైన రాజకీయశక్తిగా ఎదుగుతుందని కేంద్ర మాజీమంత్రి, బీజేపీ జాతీయ నాయకుడు బండారు దత్తాత్రేయ అన్నారు. శుక్రవారం జిల్లాకేంద్రంలో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. దేశంలో ఏ పార్టీ మద్దతు లేకుండానే బీజేపీ సొంతంగా 303 స్థానాల్లో గెలుపొంది స్పష్టమైన మెజార్టీతో మోదీ ప్రభుత్వం అధికారం చేపట్టిందన్నారు. మోదీ పాలనతీరుతో దేశవ్యాప్తంగా బీజేపీకి ఆదరణ పెరుగుతుందన్నారు. అందులో భాగంగా తెలంగాణలోనూ ప్రజల అభిమానాన్ని చూరగొని బలమైన రాజకీయ శక్తిగా ఎదుగుతున్నట్టు చెప్పారు. పార్లమెంటు ఎన్నికల్లో మూడు స్థానాలను కైవసం చేసుకోవడంతో పాటు ఓట్ల శాతం పెరగడమే ఇందుకు నిదర్శనమన్నారు. ప్రాంతీయ పార్టీల హవా కొంతకాలమే కొనసాగుతుందన్నారు. ముమ్మాటికీ తెలంగాణాలో టీఆర్‌ఎస్‌కు తామే ప్రత్యామ్నాయమని స్పష్టం చేశారు. టీఆర్‌ఎస్ నాయకులతో పాటు మిగిలన పార్టీల నుండి కూడా అనేక మంది ముఖ్య నాయకులు బీజేపీలో చేరేందుకు ఆసక్తి కనబరుస్తున్నారన్నారు. ఈ విడత రాష్ట్రంలో నిర్వహిస్తున్న సభ్యత్వ నమోదు కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తుందన్నారు. రాష్ట్రంలో కేసీఆర్ పాలన పెత్తందారుల పరిపాలనను మరిపిస్తోందని ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్య యుతంగా కాకుండా నియంతలా పరిపాలిస్తున్న కేసీఆర్‌కు తగిన గుణపాఠం తప్పదన్నారు. రాష్ట్రంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొని రైతాంగం ఆందోళనలో ఉన్నా సీఎం కేసీఆర్ ఎంతమాత్రం పట్టించుకోవడం లేదన్నారు.
సూర్యాపేట, నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో దుర్భిక్షం అధికంగా ఉన్నందున తక్షణమే సీఎం క్షేత్రస్థాయిలో పర్యటించి రైతాంగాన్ని ఆదుకునేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వర్షాభావ పరిస్థితులపై తక్షణమే క్యాబినెట్ సమావేశాన్ని ఏర్పాటుచేసి కరవు కొరల్లో చిక్కుకున్న రైతాంగాన్ని ఆదుకునేలా ప్రణాళికలు రూపొందించాలన్నారు. కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు పెరుతో కాలయాపన చేస్తున్నారే తప్ప ఈ ప్రాజెక్టుతో ఒరిగేదేమీ లేదన్నారు. రైల్వే బడ్జెట్‌లో రాష్ట్రానికి రూ.836 కోట్లు కేటాయిస్తే కేటీఆర్ మాత్రం కేంద్రం మొండిచేయి చూపిందనడం విడ్డూరంగా ఉందన్నారు. రైతులు పంటలు నష్టపోకుండా చూసేందుకు కేంద్రం ప్రవేశపెట్టిన ఫసల్ యోజన పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని, తద్వారా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. ఈ విలేఖరుల సమావేశంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వరరావు, నాయకులు కడియం రామచంద్రయ్య, కట్కూరి గన్నారెడ్డి, రంగరాజు రుక్మారావు, నల్లకుంట్ల అయోధ్య, తుక్కాని మన్మథరెడ్డి, వల్దాసు ఉపేందర్, మమతారెడ్డి, మీర్ అక్బర్, ఒంగూరి రమేష్ తదితరులు పాల్గొన్నారు.

చిత్రం... విలేఖరుల సమావేశంలో మాట్లాడుతున్న కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ