తెలంగాణ

తొలి ఏకాదశి సందడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, జూలై 12: హిందువుల పండుగల్లో మొదటిదైన తొలి ఏకాదశి పర్వదినోత్సవాన్ని ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ప్రజలు శుక్రవారం ఘనంగా జరుపుకున్నారు. ప్రముఖ పుణ్య క్షేత్రాలు శ్రీ యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి, మఠంపల్లి, వాడపల్లి, మత్స్యగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయాలకు, చెర్వుగట్టు శ్రీ పార్వతి జడల రామలింగేశ్వరస్వామి, వాడపల్లి మీనాక్షి అగస్తేశ్వర స్వామి, మేళ్లచెర్వు శంభులింగేశ్వరస్వామి, పానగల్ ఛాయ, పచ్చల సోమేశ్వర స్వామి శివాలయాలకు, పిల్లలమర్రి శివాలయాలకు భక్తులు తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా పెద్ద ఎత్తున తరలివచ్చారు. కృష్ణాతీరం వాడపల్లి, మఠంపల్లి, అడవిదేవులపల్లి ఆలయాలకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి నది స్నానాలు ఆఛరించి దైవ దర్శనాలు చేసుకున్నారు. పానగల్ ఛాయ సోమేశ్వర ఆలయంలో కృష్ణా పుష్కరణి భక్తుల పుణ్య స్నానాలు, స్వామివారి అభిషేకార్చనలతో సందడి కనిపించింది.