తెలంగాణ

టీఆర్‌టీలో యాదగిరికి ప్రథమ ర్యాంకు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తుంగతుర్తి, జూలై 12: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసిన టీఆర్‌టీ ఫలితాల్లో తుంగతుర్తి వాసి కుంచం యాదగిరి ప్రథమ స్థానంలో నిలిచారు. ఎంచుకున్న దారిలో ఒక లక్ష్యంతో ముందుకు సాగిన ఆయన మొదటి నుండి చదువుమీదే ధ్యాస, యాస నిలిపారు. ఈమేరకు సాగించిన నిర్విరామ కృషిలో విజేతగా రాష్ట్రంలోనే నెంబర్‌వన్ స్థాయిలో నిలిచారు. ఆయన స్వస్థలం సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం గొట్టిపర్తి గ్రామం. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసిన టీచర్ రిక్రూట్‌మెంట్ టెస్ట్‌లో ఆయన స్కూల్ అసిస్టెంట్‌గా (బయోసైన్సు) రాష్ట్రంలోనే ప్రథమస్థాయి ర్యాంకు దక్కించుకున్నారు. మండలానికి మారుమూల ప్రాంతమైన గొట్టిపర్తిలోని ఒక ప్రైవేటు పాఠశాలలో 1 నుండి 7వ తరగతి వరకు, 8 నుండి 10 వరకు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలో చదివారు. ఇంటర్, డిగ్రీ చదువంతా మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండల కేంద్రంలో, బీఈడి ఇతర కోర్సులన్నీ తిరుమలగిరి మండల కేంద్రంలో చదివారు. అనంతరం గొట్టిపర్తి గ్రామంలోని జడ్పీహెచ్‌ఎస్‌లో బయోసైన్సు సబ్జెక్టుతో ఒక ఏడాదిపాటు విద్యా వాలంటీరుగా పనిచేశారు. అయితే ఆయనలో అపుడే ఒక లక్ష్యంతో కూడిన పట్టుదల ఏర్పడింది. ఉపాధ్యాయునిగా ఎంపికవ్వాలనే ధ్యాసతో ఆయన దాదాపు మూడు సంవత్సరాల పాటు నిరంతరంగా చదివి గత ఏడాది టీఆర్ టీతోపాటు సోషల్ వెల్‌ఫేర్ గురుకులంలలో ఉపాధ్యాయ పరీక్షలు రాసారు. అయితే ముందుగానే వెలువడ్డ సోషల్ వెల్‌ఫేర్‌లో పరీక్ష ఫలితాల్లో ఆయనకు రాష్ట్ర స్థాయిలో 10వ ర్యాంకు దక్కింది. ఈమేరకు యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేటలో ఉపాధ్యాయునిగా విధుల్లో చేరారు. కాగా సోషల్ వెల్‌ఫేర్‌లో జాయిన్ అయిన నెల రోజులకే టీఆర్‌టీ రిక్రూట్‌మెంటు ఫలితాలు వచ్చినప్పటికీ కోర్టు కేసులు తదితర వాటితో దానిలో నియమాకాలు నిలిచిపోయాయి. కాగా ప్రస్తుతం కోర్టులో టీఆర్‌టీపై అడ్డంకులు తొలగిపోవడంతో ఎంపికైన అభ్యర్థుల జాబితాను రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెలువరించింది. ఈమేరకు కుంచం యాదగిరికి రాష్ట్రంలోనే మొదటి స్థానం దక్కింది. ఒక మారుమూల గ్రామం నుండి రాష్ట్ర స్థాయిలో యాదగిరి ప్రథమ ర్యాంకుని సాధించడం పట్ల విద్యావేత్తలు, గ్రామస్థులు హర్షం ప్రకటించారు.కాగా, టీచర్ రిక్రూట్‌మెంటులోతుంగతుర్తి మండలం నుండి మరో ఇద్దరికి చోటు దక్కింది. తుంగతుర్తి గ్రామానికి చెందిన బూర శారదతోపాటు ఎస్.రఘు ఉపాధ్యాయులుగా ఎంపికయ్యారు.

చిత్రం... కుంచం యాదగిరి