తెలంగాణ

పేదల వైద్యానికి ప్రాధాన్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సుల్తానాబాద్, జూలై 12: తెలంగాణ ప్రభుత్వం పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించేందుకు పెద్దపీట వేసిందని ఠాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. శుక్రవారం పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండల కేంద్రంలో ఆధునాతన వసతులతో ఐదు కోట్ల రూపాయలతో నిర్మాణం చేపట్టిన 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రి భవనాన్ని మంత్రి ఈటల రాజేందర్, రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ శ్రీ దేవసేన ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ అత్యవసర సమయంలో వైద్యానికి గాను గరీబోళ్లు ఇళ్ల్లు తాకట్టు పెట్టవద్దని, మహిళలు తాళిబొట్లు కుదువ పెట్టవద్దని, పేదలకు ఎలాంటి భారం లేకుండా ప్రభుత్వ ఆసుపత్రిలోనే ఉచితంగా అన్ని రకాల వైద్యం అందేలా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆధ్వర్యంలో ప్రత్యేక చర్యలు చేపడుతున్నామన్నారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో పేద ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్నామన్నారు. త్వరలో కరీంనగర్ జిల్లా కేంద్రంలో 500 పడకల ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణం చేసేందుకు కృషి చేస్తున్నామని ఆయన చెప్పారు. ప్రజలు మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ వెళ్లే అవసరం లేకుండా కరీంనగర్ జిల్లా కేంద్రంలో త్వరలోనే 500 పడకల ఆసుపత్రి నిర్మిస్తామని, పెద్దపల్లిలో సైతం నూతన ఆసుపత్రి నిర్మాణం పనులు జరుగుతున్నాయని, ప్రజలకు మరింత చేరువగా నాణ్యమైన వైద్య సేవలు అందించడానికి కృషి చేస్తున్నామన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ప్రభుత్వ ఆసుపత్రులలో సౌకర్యాలు మెరుగవుతున్నాయని, ప్రసవాల సంఖ్య పెరుగుతుందని, పేద మహిళలు గర్భం దాల్చిన సమయంలో ఆర్థిక ఇబ్బందులు కలుగకుండా ప్రభుత్వం తరపున సహాయం అందించడానికి మానవతా దృక్పథంతో కేసీఆర్ కిట్ అనే పథకాన్ని ప్రారంభించామన్నారు.
చిత్రం...సుల్తానాబాద్‌లో ఆసుపత్రి భవనాన్ని ప్రారంభిస్తున్న మంత్రులు ఈటల రాజేందర్, కొప్పుల ఈశ్వర్