తెలంగాణ

వేతనాల కోసం పంచాయతీ కార్మికుల దీక్షలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 12: పంచాయతీ కార్మికుల వేతనాల కోసం ఈ నెల 15వ తేదీ నుండి నిరాహారదీక్షలు ప్రారంభించనున్నట్టు తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయాస్, వర్కర్సు యూనియన్ గౌరవాధ్యక్షుడు పాలడుగు భాస్కర్, అధ్యక్షుడు గణపతిరెడ్డి, ప్రధానకార్యదర్శి ఐ శ్రీపతిరావులు చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కార్మికులకు వేతనాన్ని 8500కు పెంచుతామని చెప్పారని, జీవో జారీ కాలేదని అన్నారు. దీంతో పాటు అనేక సమస్యలు అపరిష్కృతంగా ఉన్నాయని అన్నారు. ముఖ్యమంత్రి హామీ ఇచ్చిన సమస్యలే ఇంత వరకూ పరిష్కారం కాకపోవడం దారుణమని చెప్పారు. గ్రామ పంచాయతీ ఉద్యోగ, కార్మికులకు వేతనాలు పెంచాలని, వేతనాల చెల్లింపునకు ప్రభుత్వమే గ్రాంట్ ఇవ్వాలని, పర్మినెంట్ చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, అర్హత ఉన్న వారిని పంచాయతీ కార్యదర్శులుగా నియమించాలని అన్నారు.