తెలంగాణ

ఉన్నత విద్యాసంస్థల్లో పరిశోధనలు ముఖ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 12: ఉన్నత విద్యాసంస్థల్లో పరిశోధనలకు పెద్ద పీట వేయాలని విద్యా శాఖ కార్యదర్శి డాక్టర్ బీ జనార్ధనరెడ్డి పేర్కొన్నారు. అంబేద్కర్ ఓపెన్ వర్శిటీలో పరీక్షల విభాగం నూతన భవనాన్ని జనార్థన్‌రెడ్డి శుక్రవారం నాడు ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ రంగ సంస్థల్లో వౌలిక సదుపాయాలు చాలా ముఖ్యమైనవని, ఉన్నత విద్యాసంస్థల్లో వౌలిక వసతుల కల్పనకు ప్రాముఖ్యత ఉందని అన్నారు. పరిశోధనలకు చాలా వౌలిక వసతుల కల్పన కూడా చాలా అవసరమని చెప్పారు. భవనాన్ని రెండు సంవత్సరాల్లో నిర్మించడం అభినందనీయమని అన్నారు. ఈ సందర్భంగా ఆయన కాంట్రాక్టు ఏజన్సీని ప్రశంసించారు. భవిష్యత్‌లో విశ్వవిద్యాలయం వైపు నుండి ఏదైనా ప్రాజెక్డుట , వౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రతిపాదన వస్తే తెలంగాణ ప్రభుత్వం సహకరిస్తుందని హామీ ఇచ్చారు. ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్ ప్రొఫెసర్ వీ వెంకటరమణ గౌరవ అతిథిగా హాజరయ్యారు. వర్శిటీ ఉప కులపతి ప్రొఫెసర్ కే సీతారామారావు కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. త్వరితగతిన భవనాన్ని నిర్మించడం సంతోషకరమని అన్నారు. రిజిస్ట్రార్ ప్రొఫెసర్ సీ వెంకటయ్య, వివిధ విభాగాల డైరెక్టర్లు, డీన్లు, విభాగాధిపతులు, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.