తెలంగాణ

అమర సైనికాధికారి విభూతి దౌండియాల్‌కు నివాళి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 12: పుల్వామాలో ఉగ్రావాదులతో జరిగిన ఎదురుకాల్పుల్లో అమరుడైన మేజర్ విభూతి శంకర్ దౌండియాల్‌కు భారత ఆర్మీ ఘనంగా నివాళులు అర్పించింది. దౌండియాల్ యువ సైనికాధికారి. 2017 వరకు ఇక్కడి మిలిటరీ కాలేజీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ మెకానికల్ ఇంజనీరింగ్‌లో విద్యను అభ్యసించారు. శుక్రవారం ఇక్కడ అదే కాలేజీలో జరిగిన కార్యక్రమంలో లెఫ్టినెంట్ జనరల్ పరంజిత్ సింగ్ మాట్లాడుతూ విభూతి దౌండియాల్ సేవలను కొనియాడారు. ఈ కాలేజీలో టెక్నికల్ వారియర్ బ్లాక్‌కు దౌండియాల్ బ్లాక్ అని నామకరణం చేశారు. ఆయన మాట్లాడుతూ ఇక్కడ డిగ్రీ పూర్తి చేసిన తర్వాత ఆర్మీలో 55 రాష్ట్రీయ రైఫిల్స్ బెటాలియన్‌లో మేజర్‌గా నియమితులయ్యారు. కాశ్మీర్‌లో సీఆర్‌పీఎఫ్ జవాన్లపై పుల్వామా వద్ద ఉగ్రవాద మూకలు దాడి చేసిన విషయం విదితమే. అనంతరం మేజర్ విభూతి దౌండియాల్ నాయకత్వంలో జవాన్లు ఉగ్రవాదులను పట్టుకునేందుకు భారీ ఎత్తున ఆపరేషన్ నిర్వహించారు. దాదాపు 20 గంటల పాటు జరిగిన ఆపరేషన్ తర్వాత మొత్తం స్థావరంలో ఉన్న ఉగ్రవాదులను దౌండియాల్ మట్టుబెట్టారు. కాగా దురదృష్టవశాత్తు ఎదురుకాల్పుల్లో వీరమరణం పొందారు. ఈ ఘటనలో దౌండియాల్‌తో పాటు మరో ముగ్గురు జవాన్లు అజయ్ కుమార్, హరిసింగ్, హవ్ శేవ్ రామ్ గాయాలతో మృతి చెందారు.
దౌండియాల్ (ఫైల్‌ఫొటో)