తెలంగాణ

షీ-టాయిలెట్లు పరిశీలించిన జపాన్ టీమ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, జూలై 13: వరంగల్ నగరంలో పారిశుద్ధ నిర్వాహణ పనులపై శనివారం జపాన్ బృందం పర్యటించింది. సానిటేషన్ సంబంధ అంశాలపై నగరానికి విచ్చేసిన జపాన్ బృందం నగరంలో విస్తృతంగా పర్యటించి పారిశుద్ధ్య నిర్వహణ పనులను పరిశీలించారు. బృంద ప్రతి నిధులు బల్దియా ప్రధాన కార్యాలయ ఆవరణలో గల షీ-టాయిలెట్‌ను పరిశీలించారు. టాయిలెట్ నిర్వహణ విధానం వంటి అంశాల్ని ఆస్కి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. చార్బౌలి ప్రాంతంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా ఇటీవల నూతనంగా నిర్మించిన వ్యక్తిగత మరుగుదొడ్డి నిర్మాణాన్ని వారు పరిశీలించారు. అనంతరం అక్కడినుండి అమ్మవారిపేటలో గల మానవ మల వ్యర్ధాల శుద్ధీకరణ ప్లాంట్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా మల మూత్రాదులు ఏ విధంగా శుద్ధి చేస్తారో సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆస్కి డైరెక్టర్ శ్రీనివాస్‌చారి వారికి మల శుద్దీకరణ ప్రక్రియను విరించారు. ఇక్కడ రెండు పద్దతుల్లో ఫికల్‌ను ఎరువుగా మార్చడం జరుగుతుందని, ఒకటి మలాన్ని వేడి చేయడం ద్వారా మెన్యుర్(ఎరువు)గా మార్చడం, మరో పద్దతిలో జియో ట్యూబ్ సాంకేతికతను ఉపయోగించి మలాన్ని ఎరువుగా మార్చుతున్నామన్నారు. ఈ ప్రక్రియకు సంబంధించి చిత్రాలను జపాన్ ప్రతినిధి తన కెమెరాలో చిత్రీకరించుకున్నారు. అనంతరం సెప్టిక్ ట్యాంక్ ఆపరేటర్‌తో సెప్టిక్ ఆపరేటింగ్ విధానం గురించి, తద్వారా లభించే ఉపాధి గురించి వారిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం అంబేద్కర్ కాలనీలో నిర్మితవౌతున్న డబుల్ బెడ్ రూంల ప్రాంతంలో నిర్మిస్తున్న మినీ యస్‌టీపీ(మురుగునీటి శుద్దికరణ కేంద్రం)ను సందర్శించారు. అక్కడి నుండి ఫారెస్ట్ కార్యాలయ ప్రాంతంలోగల పబ్లిక్ టాయిలెట్‌ను సందర్శించి నిర్వహణ తీరును అడిగి తెలుసుకున్నారు. అనంతరం రెడ్డి పురం చెరువు ప్రాంతాన్ని పరిశీలించారు. కాగా అంతకుముందు పారిశుద్యం నిర్వాహణకు అధునిక పద్దతులు, వ్యర్ధనీటి సమర్ధ నిర్వహణ అంశంపై జరిగిన సమావేశంలో జపాన్ ప్రతినిధులు పాల్గొన్నారు. వ్యర్ధ నీటి నిర్వాహణ, వికేంద్రీకరణ, చెరువునీటి సంరక్షణపై పలు సలహాలు ఇచ్చారు. బిల్, మిలిండా గేట్స్ ఫౌండేషన్ ప్రపంచంలో ఎనిమిది నగరాలు ఎంపిక చేసి, ఆ నగరాల్లో సంపూర్ణ పారిశుద్యం అమలు చేయాలనే లక్ష్యం పెట్టుకుంది. ఎంపిక చేసిన నగరాల్లో వరంగల్ మహానగరం ఉండడం శుభసూచికం