తెలంగాణ

అసెంబ్లీని 15 రోజులు కొనసాగించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 13: అసెంబ్లీ సమావేశాలను కనీసం 15 రోజులు నిర్వహించాలని, అనేక సమస్యలపై ప్రజలుకొట్టుమిట్టాడుతుంటే పట్టుమని రెండు రోజులు మాత్రమే నిర్వహించడం తగదని బీజేపీ అధికార ప్రతినిథి ఎన్‌వీ సుభాష్ డిమాండ్ చేశారు. శనివారం ఇక్కడ ఆయన విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ, ప్రజాస్వామ్యంలో అత్యున్నతవేదిక అయిన అసెంబ్లీని కేవలం రెండు రోజుల పాటు సమావేశపరచడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమన్నారు. వర్షాలు కరవక నష్టపోయిన రైతుల సమస్యలు, తీవ్ర మంచినీటి కొరత, శాంతి భద్రతలల పరిరక్షణలోప్రభుత్వ వైఫల్యం, పెరిగిపోతున్న అవినీతి లాంటి సమస్యలను సభలో ప్రస్తావించాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యమంత్రిని మంత్రులు, ఎమ్మెల్యేలు కలిసే అవకాశమే లేదన్నారు. కేవలం ఎంఐఎం నేతలు, ఒవైసీ బ్రదర్స్‌కు తప్ప వేరెవరికీ అపాయింట్‌మెంట్ దొరకదని, ఇక సామాన్యుల సంగతేమిటని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రభుత్వం దివాలా దిశలో సాగుతోందన్నారు. ఆరోగ్య శ్రీ బయిలు చెల్లించలేదని, కాంట్రాక్టు వేతనాలు ఆరు నెలల నుంచి చెల్లించడం లేదని, రైతులకు రైతు బంధు పథకం కింద చెల్లించాల్సిన డబ్బులు ఇప్పటికే 40 శాతం కూడా రైతులకు చెల్లించలేదని దీని వల్ల తీవ్ర ఇబ్బందులు, ప్రజలు, రైతులు ఎదుర్కొంటున్నారన్నారు. ఇన్ని సమస్యలు ప్రభుత్వానికి కనపడడం లేదా, వినబడడం లేదా అని ఆయన ప్రశ్నించారు.