తెలంగాణ

లెక్కల్లో తేడా రావొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 13: తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరగబోయే మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పోరేషన్లలో అభ్యర్థులు పెట్టే ఖర్చు ఎన్నికల కమిషన్ విధించిన పరిమితికి లోబడి ఉండేలా చూడాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిర్ణయించింది. అభ్యర్థులు ఎన్నికల కోసం చేసే వ్యయం పట్ల ఎన్నికల వ్యయం పరిశీలకులు అప్రమత్తంగా ఉండాలని, ఖచ్చితమైన లెక్కలు సేకరించాలని నిర్ణయించారు. ఎన్నికల సందర్భంగా నియమించిన ఆబ్జర్వర్లతో సోమవారం ఎన్నికల కమిషనర్ ప్రత్యేకంగా మీటింగ్ ఏర్పాటు చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా నియామకం అయిన ఎన్నికల పరిశీలకులు చాలా ఖచ్చితంగా వ్యవహరించాల్సి ఉందని, అందుకే వారిలో చైతన్యం కలిగించేందుకు ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నామని రాష్ట్ర ఎన్నికల కమిషన్ వర్గాలు వెల్లడించాయి.