తెలంగాణ

నేషనల్ స్పోర్ట్సు యూనివర్శిటీకి గురుకుల విద్యార్థి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 13: తెలంగాణ గిరిజన గురుకుల విద్యార్థి హరిలాల్ రమావత్ ఇంఫాల్‌లోని జాతీయ సోర్ట్సు యూనివర్శిటీకి ఎంపిక కావడం అభినందనీయమని గురుకులాల కార్యదర్శి డాక్టర్ ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ పేర్కొన్నారు. బాలానగర్‌లోని గురుకుల పాఠశాలకు చెందిన రమావత్ తెలంగాణ నుండి ఎంపికైన తొలి విద్యార్థిగా ప్రత్యేకతను చాటుకున్నాడని అన్నారు. నాగర్‌కర్నూలుకు చెందిన రమావత్ తండ్రి వికలాంగుడని, తల్లి కార్మికురాలిగా పనిచేస్తున్నారని అంతటి పేద కుటుంబం నుండి వచ్చినా, ఉన్నతమైన లక్ష్యాలతో రమావత్ జాతీయ స్థాయి ప్రత్యేకతను చాటుకున్నాడని అన్నారు. గురుకులాలను కేవలం మంచి ప్రమాణాలతో కూడిన చదువుకే పరిమితం చేయకుండా ఆటలు, క్రీడల్లో కూడా తర్ఫీదు ఇస్తూ అందరికీ ప్రావీణ్యం కల్పిస్తున్నామని అన్నారు.