తెలంగాణ

ప్రజాసమస్యలపై అలుపెరగని పోరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వనస్థలిపురం, జూలై 13: రాజకీయాలను కేవలం ఎన్నికలకు మాత్రమే పరిమితం చేయోద్దని, మార్పులు జరగాలని తెలంగాణ జన సమితి రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం చెప్పారు. శనివారం నాగోలులోని ఓ ఫంక్షన్ హాల్‌లో తెలంగాణ జనసమితి ప్రథమ ప్లీనరీ సమావేశాన్ని నిర్వహించారు. ప్లీనరీకి రాష్ట్రం నలుమూలల నుంచి నాయకులు, కార్యకర్తలు, తెలంగాణ ఉద్యమకారులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. తెలంగాణ సాంస్కృతి, సాంప్రదాయలను గుర్తు చేసే విధంగా కళాకారుల బృందం కళారూపాలను ప్రదర్శించింది. ప్లీనరీలో కోదండరాం మాట్లాడుతూ తెలంగాణ ప్రజల సమస్యలను పరిష్కారించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. రాష్ట్రంలో అనేక సమస్యలున్నాయని, టీఆర్‌ఎస్ ప్రభుత్వం వాటిన పట్టించుకోకుండా డబ్బులు వెదజల్లి ఎన్నికల్లో అధికారంలోకి వస్తోందని ధ్వజమెత్తారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ జనసమితి నిరంతరం పోరాటం చేస్తుందని గుర్తు చేశారు. కొత్త వ్యక్తులు, కొత్త సమాజం ఆవిష్కరణ కోసం కృషి చేస్తున్నట్లు కొదండరాం తెలిపారు. సమాజ సంక్షేమం, సాధికారిత కోసం పోరాటాలు చేయడానికి సిద్ధం కావాలని పిలుపు నిచ్చారు. రాష్ట్రంలో ఉన్న టీఆర్‌ఎస్ ప్రభుత్వం నిర్మాణాలు, కూల్చివేతల రాజకీయాలను కొన సాగిస్తోందని ఆవేదన చెందారు. తెలంగాణ జనసమితి పార్టీ రాష్ట్రంలో ఎప్పుడు విపక్షం కాదని, ప్రజా పక్షం వైపుఉంటూ సమస్యలు పరిష్కరిస్తోందని ఆయన ప్రకటించారు. పార్లమెంట్ ఎన్నికల ఫలితాల తర్వాత టీఆర్‌ఎస్‌లో గుబులు మొదలయిందని, ప్రగతి భవన్ ఖాళీ అయ్యే సమయం ఆసన్నమైతుందని ఆయన జోస్యం చెప్పారు. తెలంగాణ జనసమితి కార్యకర్తలు, నాయకులు ప్రజల సమస్యల పరిష్కారం కోసం మలి దశ ఉద్యమాన్ని తలపించే విధంగా పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. ఈకార్యక్రమంలో ప్రొఫెసర్ తిరుమల్ రావు, పాండురంగా రావు, స్వరాజ్ ఇండియా జాతీయ అధ్యక్షుడు యోగేందర్ యాదవ్, తెలంగాణ జనసమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అంబటి శ్రీనివాస్, తెలంగాణ జన సమితి రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు కేవీ.రంగారెడ్డి, రమేష్‌రెడ్డి, నాయకులు పల్లె వినయ్ పాల్గొన్నారు.