తెలంగాణ

మైనింగ్ నిధులను అక్రమంగా తరలించారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేరేడుచర్ల, జూలై 13: రాష్ట్ర విద్యాశాఖ మంత్రి జగదీశ్వర్‌రెడ్డి మైనింగ్ నిధులను అక్రమంగా తరలించారని టీపీసీసీ అధ్యక్షుడు, నల్లగొండ పార్లమెంట్ సభ్యుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. ఆయన శనివారం నేరేడుచర్లలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించి అనంతరం విలేఖరులతో మాట్లాడుతూ సిమెంట్ పరిశ్రమల నుండి వచ్చే మైనింగ్ మినరల్ నిధులను సూర్యాపేట, తుంగతుర్తి నియోజకవర్గాలకు తరలించి హుజూర్‌నగర్ నియోజకవర్గానికి తీరని అన్యాయం చేశారని విమర్శించారు. సిమెంట్ పరిశ్రమలున్న ఈ ప్రాంతంలో రహదారులు అద్వానంగా ఉండగా ఆ నిధులు కేటాయించకుండా ఇతర నియోజకవర్గాలకు కేటాయించడం ఆసమంజసం అన్నారు.
తాము రహదారులు నిర్మించామని, కాని ఆ రహదారులకు గుంతలు కూడా పూడ్చలేరా అని ప్రశ్నించారు. మినరల్ నిధులపై త్వరలో నియోజకవర్గ వ్యాప్తంగా ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ప్రభుత్వ నిధులను టీఆర్‌ఎస్ పార్టీ నిధులుగా భావించి టీఆర్‌ఎస్ నియోజకవర్గ ఇన్‌చార్జి శానంపూడి సైదిరెడ్డి చేస్తున్న శంకుస్ధాపనలపై జిల్లా కలెక్టర్, లోక్‌సభ స్పీకర్‌కు ఫిర్యాదు చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో అత్యధిక మున్సిపాలిటీలో కాంగ్రెస్ కైవసం చేసుకుంటుందని హుజూర్‌నగర్, నేరేడుచర్ల మున్సిపాలిటీల్లో తప్పకుండా విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్, డైరెక్టర్ ఆఫ్ మున్సిపాలిటీతో మాట్లాడినట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో పాలకీడు జడ్పీటీసీ మాలోతు మోతిలాల్, ఎంపీపీ భూక్యా గోపాల్, మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ కట్టా రామారావు పాల్గొన్నారు.