తెలంగాణ

బార్ కౌన్సిల్‌కు రూ.100 కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 13: తెలంగాణలో న్యాయవాదుల సంక్షేమానికి వందకోట్లు కేటాయించాలని ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ సంస్థ డిమాండ్ చేసింది. ఏవీ కృష్ణారావు అధ్యక్షతన ఐఎఎల్ రాష్టస్రమతి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఐఎఎల్ జాతీయ ప్రధానకార్యదర్శి బొమ్మగాని ప్రభాకర్ మాట్లాడుతూ న్యాయవాదులకు ఇచ్చే వెల్ఫేర్ ఫండ్‌ను 10 లక్షలకు పెంచాలని అన్నారు. యువ న్యాయవాదులకు స్కాలర్‌షిప్‌లు ఇవ్వాలని, అర్హులైన న్యాయవాదులు అందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పారు. న్యాయవాదులు అంతా సంఘటితంగా తాము ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి పోరాడాలని అన్నారు. రాష్టవ్య్రాప్తంగా ఐఎఎల్ ఆధ్వర్యంలో వివిధ సమస్యలపై సెమినార్లు నిర్వహిస్తూ న్యాయవాదులను చైతన్యం చేయడానికి అనేక కార్యక్రమాలు చేపట్టామని అన్నారు. ప్రత్యేక తెలంగాణ సాధనలో న్యాయవాదులు ఎంతో కీలక పాత్ర పోషించారని గుర్తుచేశారు. రాష్ట్రం ఏర్పడితే సమస్యలు పరిష్కారం అవుతాయని, ఉద్యోగాలు వస్తాయని ఎంతో ఆశగా చొశారని అన్నారు. బార్ కౌన్సిల్ సభ్యుడు దూస జనార్ధన్, రత్నం, డీ జయశ్రీనివాస్ పాల్గొన్నారు.