తెలంగాణ

బీసీలంటే భిక్షగాళ్లు కాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 15: బీసీలు అంటే భిక్షగాళ్లు కాదని, సంపదను సృష్టించేవాళ్లు కనుక తమ వాటా తమకు కావాలని అడుగుతున్నారని బీసీ హక్కుల సాధన సమితి రాష్ట్ర ప్రధానకార్యదర్శి రాయబండి పాండురంగం పేర్కొన్నారు. హక్కుల సాధన సమితి పిలుపు మేరకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లకు వినతిపత్రాలను అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజ్యాంగం ప్రకారం సమాన అవకాశాలు కల్పించాల్సి ఉన్నా అది జరగడం లేదని అన్నారు. రాజ్యాంగ ఫలాలు అందరికీ అందడం లేదని అన్నారు. జనాభాలో సగానికి పైగా ఉన్న బీసీల గురించి పట్టించుకున్న దాఖలాలే లేవని పేర్కొన్నారు. బీసీ కులాల్లో అత్యంత వెనుకబడ్డ సంచార జాతులు, ఎంబీసీలకు ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. రాష్ట్రంలో 60 లక్షల బీసీ కుటుంబాలు ఉన్నాయని, బీసీ కార్పొరేషన్ ద్వారా సబ్సిడీకి, రుణాలకు దరఖాస్తు చేసింది మాత్రం 5.75 లక్షల మంది మాత్రమేనని అన్నారు. కానీ ఇంత వరకూ తూతూ మంత్రంగా ఖర్చు చేసి, తర్వాత ఎన్నికల కోడ్ ఉందని తప్పించుకున్నారని అన్నారు. డబుల్ బెడ్ రూమ్ పథకం కింద 2 లక్షల 60వేల ఇళ్లు లేని నిరుపేదలకు ఇళ్లు నిర్మించి ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఆశలు పెట్టిందని అవన్నీ అడియాసలే అయ్యాయని పేర్కొన్నారు. రిజర్వేషన్లను తగ్గిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఆర్డినెన్స్‌ను వెనక్కు తీసుకోవాలని అన్నారు. బీసీల అభివృద్ధికి స్పెషల్ సబ్‌ప్లాన్ అమలుచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మనె్న రాజేందర్, వర్రే ఇస్తారి, పాపయ్య గౌడ్, బొడ్డుపల్లి శివ, ఎస్ సంగమేశ్వర్, బీ విజయలక్ష్మీ, వీ వేణాచారి పాల్గొన్నారు.