తెలంగాణ

ఖమ్మం సంఘటనపై సమగ్ర విచారణకు ఆదేశం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 15: ఖమ్మం పట్టణంలోని ఎస్‌సీ బాలికల వసతి గృహంలో ఆదివారం రాత్రి జరిగిన అగ్నిప్రమాద సంఘటనపై సమగ్ర విచారణ జరిపి, పూర్తిస్థాయి నివేదికను అందించాలని రాష్ట్ర సంక్షేమ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆదేశించారు. ఈ అగ్నిప్రమాదంలో ఒక బాలిక మృతి చెందడం దురదృష్టకరమన్నారు. ఈ సంఘటన తన మనసును కలచివేసిందన్నారు. భవిష్యత్తులో ఈ తరహా సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. ఖమ్మం జిల్లా కలెక్టర్, ఎస్‌సీ సంక్షేమ శాఖ జిల్లా అధికారితో మంత్రి ఫోన్‌లో మాట్లాడారు. ఈ సంఘటనపై ప్రత్యేక శ్రద్ద తీసుకుని అవసరమైన చర్యలు తీసుకోవాలని మంత్రి ఈశ్వర్ ఆదేశించారు.