తెలంగాణ

మున్సిపల్ కార్మికుల వేతనాల పెంపునకు పోరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 15: మున్సిపల్ కార్మికుల వేతనాల పెంపునకు పోరు కొనసాగుతుందని రాష్ట్ర మున్సిపల్ స్ట్ఫా , ఔట్ సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి మందా వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. కేసీఆర్ ప్రభుత్వానికి మున్సిపల్ కార్మికుల పట్ల చిత్తశుద్ధి ఉంటే తెలంగాణ రాష్ట్రంలో వివిధ విభాగాల్లో పనిచేస్తున్న మున్సిపల్ ఉద్యోగులకు పదోన్నతులు కల్పించాలని కోరారు. కాగా, సీఐటీయూ నేతలు చుక్క రాములు, ఎం సాయిబాబు వేరొక ప్రకటన విడుదల చేస్తూ కార్మిక చట్టాల మార్పు కార్మిక హక్కులకు గొడ్డలిపెట్టుగా మారిందని పేర్కొన్నారు. కార్మికులకు రోజు వేతనం 178 రూపాయిలుగా కేంద్రప్రభుత్వం ప్రకటించడం అన్యాయమని, అమానుషమని అన్నారు. బీజేపీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక చర్యలకు పాల్పడుతోందని, విశాల ఐక్యతతో రాష్ట్ర వ్యాప్త ప్రతిఘటనకు ప్రతి ఒక్కరూ ఉద్యుక్తులు కావాలని సీఐటీయూ నేతలు కోరారు.