తెలంగాణ

యురేనియం తవ్వకాలు వద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 15: యురేనియం తవ్వకాల ప్రతిపాదనలను వెంటనే ఉపసంహరించుకోవాలని, కృష్ణా జలాలను కలుషితం చేయవద్దని, వన్య ప్రాణులను, పర్యావరణాన్ని కాపాడాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ను సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం కోరారు. నాగార్జున సాగర్ లంబాపూర్ గుట్టల్లో , శ్రీశైలం ఆమ్రాబాద్ ఏరియాలో కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన యురేనియం తవ్వకాలు, పరిశోధనలను తక్షణమే ఉపసంహరించుకోవాలని అన్నారు. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు హైదరాబాద్‌లో సగం జనాభాకు తాగునీటికి కృష్ణా జలాలే దిక్కు అని, యురేనియం తవ్వకాలు పరిశోధనల వల్ల ఈ నీరు అందిస్తున్న నాగార్జున సాగర్, శ్రీశైలం జలాశయాలు విషపూరితం అవుతాయని అన్నారు. దేశం రెండు పెద్దవైన పులల అభయారణ్యం, ఆమ్రాబాద్ టైగర్ రిజర్వు ఫారెస్టులు అస్థిత్వం కూడా దెబ్బతింటుందని అన్నారు. పర్యావరణం కాలుష్యపూరితం అవుతుందని, అటవీ సంపదతో పాటు జీవరాశులు కూడా నాశనం అవుతాయని, అటవీ శాఖ కూడా ఇలాంటి తీవ్ర నష్టాలను తమ రిపోర్టులో పేర్కొన్నాయని గుర్తించాలని అన్నారు.