తెలంగాణ

ఎన్నికల పరిశీలకులూ.. జాగ్రత్త

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 15: తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరగబోయే మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పోరేషన్ల ఎన్నికల సందర్భంగా పరిశీలకులుగా నియామకం అయ్యేవారు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వి. నాగిరెడ్డి హెచ్చరించారు. ఎన్నికల సమయంలో పరిశీలకులు ఆచరించాల్సిన విధి విధానాలపై సూచలు చేసేందుకు మారియెట్ హోటల్‌లో సోమవారం ప్రత్యేక శిక్షణాసమావేశం ఏర్పాటు చేశారు. ఎన్నికల పరిశీలకులుగా నియామకం అయ్యే అధికారులు తమకు కేటాయించిన మున్సిపాలిటీల్లో ప్రత్యక్షంగా అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ఒక్కో వార్డుకు ఒక ఎన్నికల పరిశీలకుడిని నియమిస్తున్నామని, ప్రతి వార్డు ఒక నియోజకవర్గంగా పరిగణిస్తామని గుర్తు చేశారు. రాష్ట్రంలో 142 మున్సిపాలిటీలు ఉండగా, 132 మున్సిపాలిటీలకు త్వరలో ఎన్నికలు నిర్వహిస్తున్నామన్నారు. 3,149 వార్డులకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉందని వివరించారు.
శాసనసభ ఎన్నికల సందర్భంగా అవలభించిన విధి విధానాలే స్థానిక సంస్థల ఎన్నికలకు కూడా వర్తిస్తాయని నాగిరెడ్డి పేర్కొన్నారు. రిటర్నింగ్ అధికారులు తమకు కేటాయించిన బాధ్యతలను పారదర్శకంగా తు.చ తప్పకుండా అమలు చేయాలని ఆదేశించారు. ఎన్నికలకు సంబంధించిన సమాచారం తెలుసుకునేందుకు ‘టీ-పోల్’ పేరుతో ఒక యాప్‌ను రూపొందించామన్నారు. పోలింగ్ స్టేషన్ల వారీగా ఓటర్ల జాబితా వివరాలను ఎన్నికల కమిషన్ వెబ్‌పోర్టల్‌లో అందుబాటులో ఉంచుతామన్నారు. ఓటర్లు ఓటర్‌స్లిప్పులను కూడా డౌన్‌లోడ్ చేసుకునే వీలు కల్పిస్తున్నామన్నారు. ప్రతి పోలింగ్ కేంద్రం పరిధిలో 800 మంది వరకు ఓటర్లు ఉంటారన్నారు. రాజకీయ పార్టీల ప్రతినిధులతో రిటర్నింగ్ అధికారులు సమావేశాలు నిర్వహించి, వారి నుండి సమస్యలు, సూచనలు, సలహాలను తెలుసుకోవాలని నాగిరెడ్డి సూచించారు. పోలింగ్ నిర్వహించే రోజు పోలింగ్ కేంద్రాల్లో, మరీ ముఖ్యంగా ఓటు వేసేందుకు నిర్దేశించిన స్థలంలో వెలుతురు స్పష్టంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు బందోబస్తుకు సంబంధించి కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకోవాలన్నారు. ఎన్నికల నియమావళి ఖచ్చితంగా అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎన్నికల ప్రచారంలో ఉపయోగించే లౌడ్‌స్పీకర్లు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకే పనిచేసేలా చూడాలని ఆదేశించారు. అభ్యర్థులు ఎన్నికల వ్యయానికి సంబంధించిన ఖర్చులకోసం రిటర్నింగ్ అధికారులు షాడో రిజిస్టర్లను నిర్వహించాలన్నారు. ప్రతి మున్సిపాలిటీ ఎన్నికల కోసం ఒక డిస్ట్రిబ్యూషన్, ఒక కలెక్షన్, ఒక కౌంటింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. స్ట్రాంగ్ రూంల సమీపంలోనే కౌంటింగ్ హాళ్లు ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. రిటర్నింగ్ అధికారులు తమకు కేటాయించిన మున్సిపాలిటీలో సిబ్బందికి ఎన్నికల నిర్వహణపై శిక్షణ ఇవ్వాలని సూచించారు. పోలింగ్ కేంద్రాల్లో వౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయాలని, అలాగే వెబ్ కాస్టింగ్ కూడా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో స్పెషల్ ఆఫీసర్ సురేష్ చందా, అడిషనల్ డీజీపీ గోవింద్ సింగ్‌జీ, మున్సిపల్ వ్యవహారాల శాఖ డైరెక్టర్ టీ.కే. శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.
చిత్రం... సమావేశంలో మాట్లాడుతున్న ఎన్నికల కమిషనర్ వీ. నాగి రెడ్డి