తెలంగాణ

విద్యారంగంపై దార్శనిక పత్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 15: తెలంగాణ రాష్ట్రంలో రానున్న రోజుల్లో విద్యా ప్రమాణాలను పెంచడంతో పాటు అందరికీ విద్యను చేరువచేసే క్రమంలో విద్యానిపుణులతో ఉన్నత విద్యామండలి భారీ కసరత్తు ప్రారంభించింది. నిపుణుల అభిప్రాయాలను తీసుకున్న తర్వాత ఒక దార్శనిక పత్రాన్ని రూపొందిస్తారు. ఈ నివేదికను గవర్నర్‌కూ ప్రభుత్వానికి ఉన్నత విద్యామండలి పంపనుంది. ఈ భారీ కసరత్తుకు సీఐఐ, ఫిక్కీ ప్రతినిధులను సైతం ఆహ్వానించారు. ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ టి పాపిరెడ్డి, కార్యదర్శి బి జనార్ధనరెడ్డి, మాజీ ఐఎఎస్ ఎం గోపాలకృష్ణ, మండలి ఉపాధ్యక్షులు ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి, ప్రొఫెసర్ వీ వెంకటరమణ, కార్యదర్శి డాక్టర్ శ్రీనివాస్, మండలి సభ్యులు ప్రొఫెసర్ ఓఎన్‌రెడ్డి, ఉస్మానియా మాజీ వీసీ ప్రొఫెసర్ టీ తిరుపతిరావు, ప్రొఫెసర్ ఎ రవీందర్‌నాధ్, ఐఎస్‌బీ మాజీ డీన్ అజిత్ రంగేకర్ వంటి హేమా హేమీలు ఈ భేటీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాపిరెడ్డి ప్రభుత్వ ఆలోచనలను, మండలి లక్ష్యాలను, యూనివర్శిటీల భవిష్యత్ ఊహా చిత్రాన్ని వివరించారు. పది ప్రధాన అంశాలపై ఆయన చర్చను లేవనెత్తారు. ఎం గోపాలకృష్ణ మాట్లాడుతూ ఉన్నత విద్యారంగంలో ప్రస్తుత స్థితి, మున్ముందు ఉండాల్సిన పాలనాతీరును వివరించారు. విద్యాత్మక పాలకులను నియమించి, వర్శిటీలను గాడిలో పెట్టాలని సూచించారు. ప్రతి విద్యాసంస్థకూ ఒక లక్ష్యం, నమ్మిక, పారదర్శకత, సాంకేతిక ప్రగతి ముఖ్యమని పేర్కొన్నారు. ప్రొఫెసర్ తిరుపతి రావు మాట్లాడుతూ యూనివర్శిటీల ఆడిట్‌లో లోపాలను సరిచేయాలని అన్నారు. టీఈజడ్ ఎండీ డాక్టర్ నందితా సేథీ మాట్లాడుతూ యూనివర్శిటీల్లో చదువుకునే విద్యార్థుల్లో పారిశ్రామిక ఔత్సాహికతను పెంచాలని చెప్పారు. టీసీఎస్ ఉపాధ్యక్షుడు వీ రాజన్న మాట్లాడుతూ ఐటీ రంగంలో 500 యూనివర్శిటీ టీచర్లను, 5వేల మంది స్కూల్ టీచర్లకు శిక్షణ ఇచ్చేందుకు సిద్ధమన్నారు. ఓఎన్ రెడ్డి, ప్రొఫెసర్ మెండు, రామమోహన్‌రావు, డాక్టర్ వీ వెంకటేశ్వర్లు, గాయత్రీ సుగర్స్ ఎండీ సరితారెడ్డి, ప్రొఫెసర్ వీ వెంకటరమణ, నాగేంద్ర పులమాటి, సీఐఐ ప్రతినిధి అరుణ, ప్రొ. లింబాద్రి తదితరులు తమ ఆలోచనలను వివరించారు.