తెలంగాణ

ఖనిజాభివృద్ధి సంస్థను నెంబర్ వన్‌గా తీర్చిదిద్దుతాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 16: తెలంగాణ ఖనిజాభివృద్ధి సంస్ధను దేశంలోనే నెంబర్ వన్‌గా, అదర్శప్రాయంగా తీర్చిదిద్దుతామని సంస్థ చైర్మన్, ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి తెలిపారు. తెలంగాణ ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్‌గా మూడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా టీఎస్‌ఎండీసీ ఎండీ డాక్టర్ మల్సూర్ ఖనిజాభివృద్ధి సంస్థ ఉద్యోగులు చైర్మన్‌ను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా సుభాష్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీస్సులు, కేటీఆర్ సహకారంతో దేశంలవనే అత్యున్నత ప్రమాణాలు కలిగిన ఖనిజాభివృద్ధి సంస్థగా తీర్చిదిద్దామని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వానికి ప్రభుత్వ ఆదాయ వనరుల్లో ఒక సంస్థగా టీఎస్‌ఎండీసీ అని వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ముందు ఏడేళ్లలో ఖనిజాభివృద్ధి సంస్థ ద్వారా ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం కేవలం రూ.39.69 కోట్లు అయితే, ప్రస్తుతం 2014 నుంచి 2016 వరకు రూ.535.43 కోట్లు ఆదాయం రాగా, అది క్రమేన పెరిగి 2016 నుంచి ఈనెలో రూ.2207.79 కోట్ల ఆదాయం వరకు చేరిందని తెలిపారు. ఇది సంస్థలో పనిచేస్తున్న అధికారులు, ఉద్యోగుల కృషి ఫలితామేనని వివరించారు. తెంలగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు 80కి పైగా ఇసుక స్టాక్ యార్డుల ద్వారా నాలుగేళ్లలో 4 కోట్ల 30 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక సరఫరా చేయడంతో ఇప్పటి వరకు రూ.2753.09 కోట్ల ఆదాయం ప్రభుత్వ ఖజానాకు చేరిందని తెలిపారు. 2వేల కోట్ల పెట్టుబడి పెట్టిన సంస్థ ద్వారా 4వేల కుటుంబాలకు ప్రత్యక్షంగా, మరో 20 వేల మందికి పరోక్షంగా ఉపాధి లభించిందని ఆయన తెలిపారు. టీఎస్‌ఎండీసీని జాతీయ ఖనిజానే్వషణ సంస్థగా కేంద్ర ఖనిజాభివృద్ధి సంస్థ గుర్తించడం జరిగిందని తెలిపారు.
చిత్రం...తెలంగాణ ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్ శేరి సుభాష్ రెడ్డిని అభినందిస్తున్న సంస్థ అధికారులు, ఉద్యోగులు