తెలంగాణ

కార్పొరేట్లను ధనవంతుల్ని చేసిన బడ్జెట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 16: కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ తీరు చూస్తుంటే కార్పొరేట్లను మరింత ధనవంతుల్ని చేసేదిగా ఉందని ఎఐసీటీయూ జాతీయ ఉపాధ్యక్షుడు టీ నరసింహన్ పేర్కొన్నారు. దేశ ప్రజల అభివృద్ధినీ, సంక్షేమాన్నీ పాతర వేసి పేదలను మరింత పేదలుగా , ధనవంతులను మరింత ధనవంతులుగా చేసే దుర్మార్గమైన చర్యలను ప్రజలు, కార్మికులు తిప్పికొట్టాలని అన్నారు. ఎఐటీయూసీ నిర్వహించిన ధర్నాలో పాల్గొన్న నరసింహన్ మాట్లాడుతూ పెరుగుతున్న నిరుద్యోగాన్ని నిర్మూలించడంలో కేంద్రం విఫలమైందని అన్నారు. అనేక పోరాటాలు చేసి సాధించిన 44 కార్మిక చట్టాలను 4 కోడ్‌లుగా మార్చి కార్మికుల హక్కుల్ని నిర్వీర్యం చేసి పెట్టుబడీదారులకు, బడా వ్యాపారులకు, కార్పొరేట్ శక్తులకు మేలు చేయడమే బడ్జెట్ ఉద్ధేశ్యంగా కనిపిస్తోందని అన్నారు. ప్రజావ్యతిరేక బడ్జెట్‌కు నిరసనగా జూలై 17 వరకూ దేశవ్యాప్తంగా వివిధ రూపాల్లో నిరసన, ఆందోళన కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ఎఐటీయూసీ అధ్యక్షుడు ఎస్ బాల్‌రాజ్, ఉపాధ్యక్షుడు బీ చంద్రయ్య, కే ఏసురత్నం, ఎఐటీయూసీ కార్యదర్శులు బి వెంకటేశం, ఎం నర్సింహా, కరుణకుమారిత, తదితరులు ఈ ధర్నాలో పాల్గొన్నారు.