తెలంగాణ

చివరి విడత డిగ్రీ అడ్మిషన్లు 17 నుండి ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 16: రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీల్లో చివరి విడత అడ్మిషన్లకు ‘దోస్త్’ కమిటీ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీలో కొత్తగా మరికొంత మంది ఉత్తీర్ణులు కావడంతో వారికి డిగ్రీ అడ్మిషన్లు కల్పించాలనే సదుద్ధేశ్యంతో దోస్త్ చివరి విడత అడ్మిషన్లు చేపడుతున్నట్టు కన్వీనర్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి తెలిపారు. కొత్తగా ఇంటర్ పాసైన వారు తాజాగా 400 రూపాయిలు చెల్లించి రిజిస్టర్ చేసుకుని వెబ్ ఆప్షన్లు ఇవ్వొచ్చు. గతంలో పాసై ఇంత వరకూ దరఖాస్తు చేయని వారు కూడా ఇపుడు దరఖాస్తు చేసుకోవచ్చు. గతంలో దరఖాస్తు చేసి, వెబ్ ఆప్షన్లు ఇవ్వని వారు, వెబ్ ఆప్షన్లు ఇచ్చినా సీటు పొందని వారు, సీట్లు పొందినా ఆన్‌లైన్ కన్ఫర్మేషన్ చేయని వారు, ఆన్‌లైన్ కన్ఫర్మేషన్ చేసినా సంబంధిత ఓటీపీని కాలేజీలో అందజేయని వారు ఇపుడు రిజిస్టర్ చేసుకుని వెబ్ ఆప్షన్లు ఇవ్వొచ్చు. గతంలో రిజిస్టర్ చేసుకున్న వారు తమ డాటాను మార్చకుండానే తా జాగా వెబ్ ఆప్షన్లు ఇవ్వాలని కన్వీనర్ సూచించారు.
ఈ నెల 17వ తేదీ నుండి 22వ తేదీ వరకూ అభ్యర్ధులు కొత్తగా రిజిస్టర్ చేసుకోవచ్చని ఆయన చెప్పారు. ఎన్‌సీసీ, కేప్, పీహెచ్ తదితర స్పెషల్ కేటగిరి అభ్యర్ధులు 20వ తేదీన సమీపంలోని హెల్ప్‌లైన్ సెంటర్లుకు వెళ్లి కన్ఫర్మ్ చేసుకోవాలని, స్పెషల్ ఫేజ్‌లోదరఖాస్తు చేసిన వారికి 26న సీట్ల కేటాయింపు ఉంటుందని, వారంతా 26 నుండి 29వ తేదీ మధ్యలో ఆన్‌లైన్ రిపోర్టింగ్‌తో పాటు ఆయాకాలేజీలకు వెళ్లి రిపోర్టు చేయాలని అన్నారు.