తెలంగాణ

ఇద్దరు తహశీల్దార్ల సస్పెన్షన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూర్యాపేట, జూలై 16: భూ సమస్యల పరిష్కారంలో తీవ్ర నిర్లక్ష్యం వహిస్తూ రాష్టవ్య్రాప్తంగా రెవెన్యూ శాఖపై విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో సూర్యాపేట జిల్లాలో రైతుల భూ సమస్యల పరిష్కారంపై జిల్లా కలెక్టర్ దుగ్యాల అమయ్‌కుమార్ ప్రత్యేక దృష్టిసారించారు. ఏళ్ల తరబడి భూ పట్టాల కోసం కార్యాలయాల చుట్టూ తిరుగుతూ రెవెన్యూ తీరుపై నిరసన వ్యక్తం చేస్తున్న ఘటనలు వరసగా జిల్లాలో వెలుగు చూడటంతో రంగంలోకి దిగిన కలెక్టర్ రైతులతో ముఖాముఖి పేరుతో ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. నేరుగా మండల కేంద్రాల్లో రైతు సదస్సులు నిర్వహిస్తూ తానే స్వయంగా హాజరవుతూ రైతుల సమస్యలను పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో రెవెన్యూ సిబ్బంది పనితీరుపై ఆరోపణలు వెల్లువెత్తుతుండగా బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటున్నారు. తాజాగా జిల్లాలోని కోదాడ రెవెన్యూ డివిజన్ పరిధిలో గల మేళ్లచెర్వు, చింతలపాలెం మండలాల తహశీల్దార్లు డి.శంకరయ్య, బాబాషర్ఫుద్దీన్‌లను సస్పెండ్ చేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. ఈ రెండు మండలాల తహశీల్దార్ల పనితీరు సక్రమంగా లేకపోవడంతోపాటు ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వకుండా విధులకు గైర్హాజరు కావడం, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూ రికార్డుల ప్రక్షాళన పట్ల నిర్లక్ష్యం వహించడంతో వారి ఇద్దరిని సస్పెండ్ చేసినట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ రెండు మండలాల్లో భూ సమస్యల పరిష్కారంలో తహశీల్దార్లు నిర్లక్ష్యం వహించిన కారణంగా రైతులు పలుమార్లు ఆందోళనలు చేపట్టారు.
కార్యాలయాల ముందు ధర్నా చేయడంతో పాటు తాళం వేసి నిరసనలు తెలిపారు. ఈ ఘటనల నేపథ్యంలో వారి పనితీరుపై ప్రత్యేక దృష్టిసారించిన కలెక్టర్ విధులను నిర్లక్ష్యం చేస్తున్నట్టు గుర్తించి వేటు వేశారు. భూ సమస్యలపై నిర్లక్ష్యం వహిస్తూ అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆరుగురు వీఆర్వోలను ఇప్పటికే సస్పెండ్ చేయగా తాజాగా ఇద్దరు తహశీల్దార్లపై కూడా వేటు పడటంతో జిల్లాలో రెవెన్యూ అధికారులు, సిబ్బందిలో ఆందోళన నెలకొంది.